English | Telugu

జానకి చదువు ఆగదు.. అమరదీప్ కి శోభనం జరగదు!


'మొగుడ్స్ పెళ్లామ్స్' షో ఎవ్రీ వీక్ నవ్వులతో సాగిపోతోంది. ఈ వారం ఎపిసోడ్ కూడా అంతే జోష్ ని అందించింది. ఫైనల్‌గా ఈ షోలో పెర్ఫార్మ్ చేసిన కపుల్స్ అందరికీ డిఫరెంట్ నేమ్స్ తో అవార్డ్స్ కూడా అందించారు స్టమక్ స్టార్ ముక్కు అవినాష్. ముందుగా "బయట మ్యూజిక్ ఇంట్లో మ్యాజిక్" అవార్డును సాకేత్ కొమాండూరి, పూజిత కపుల్ కి అందించారు. "స్టమక్ స్టార్ అని నాకు అవార్డు ఇచ్చారు కానీ సాకేత్ కి ఇవ్వాలి" అన్నాడు అవినాష్.

తర్వాత సాకేత్ విన్నింగ్ స్పీచ్ ఇచ్చాడు. "నాకు తెలిసి ఫస్ట్ టైం అవార్డు ఫంక్షన్ లో యాంకర్స్ దిక్కులేకుండా పక్కన నిలబడి అనౌన్స్ చేస్తుంటే గెలిచిన వాళ్ళు పోడియం మీద నిలబడి మాట్లాడుతున్నారు" అన్నాడు. స్టేజి మొత్తం నవ్వులు విరిశాయి. "ఈ అవార్డుని బయట నాతో కలిసి పని చేసే కో-మ్యుజీషియన్స్ అందరికి డేడికేట్ చేస్తున్నాన‌"ని చెప్పాడు సాకేత్‌.

తర్వాత "ఆగదు.. జరగదు" అనే అవార్డుని అమరదీప్, ప్రియాంకకి ఇచ్చారు. 'జానకి కలగనలేదు' సీరియల్ లో కపుల్ గా నటిస్తున్నారు వీళ్ళు. 'జానకి చదువు ఆగదు.. అమరదీప్ కి శోభనం జరగదు' అనే కాన్సెప్ట్ లో ఈ అవార్డుని అందించారు. ఏ షో ఐనా ఇద్దరి మధ్యా రొమాన్స్ తగ్గట్లేదు అంటూ "నీ యవ్వా తగ్గేదేలే" అనే అవార్డుని కీర్తికి, మహేష్ కి ఇచ్చారు. "ఒకటా, రెండా, మూడా" అనే అవార్డుని అర్జున్ అంబటి, సుహాసినికి ప్రెజంట్ చేశారు.

"ముసలోళ్లే కానీ మహానుభావులు" అనే అవార్డుని అప్పారావు, లక్ష్మికి అందించారు. "ఊ అంటారా.. ఊఊ అంటారా" అవార్డుని నిఖిల్, కావ్యకి ఇవ్వగా క్రేజీ టైటిల్ "ఆడా ఉంటాం.. ఈడా ఉంటాం" అవార్డుని రవికృష్ణ, నవ్యస్వామికి అందించారు. ఫైనల్ గా "నా మాటే శాసనం" పేరుతో ఉన్న అవార్డుని జ్యోతి, గంగూలీ కపుల్ కి ఇచ్చి విన్నర్స్ అందరితో విన్నింగ్ స్పీచెస్ తీసుకున్నారు. భార్యాభర్తలు ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండాలి అని కోరుకుంటున్నానిని చెప్తూ ఈ షోని ఎండ్ చేసింది అందాల శ్రీముఖి.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.