English | Telugu

ముద్దులాట.. ముద్దులాట.. హ్యాపీతో కిస్సులాట!

ఇటీవల సోషల్ మీడియా మొత్తం కూడా యాంకర్స్ పెట్స్ తో చేస్తున్న ముద్దులాటలు, సరదాగా ఆట పట్టించే వీడియోలు ఎక్కువగా కనిపిస్తున్నాయ్. కొంతకాలం క్రితం సుమ కుక్కకి ట్రైనింగ్ ఇస్తూ కనిపిస్తే, నిన్న అష్షు కుక్కకి గోల్డ్ తొడిగి ముద్దులు పెడుతూ కనిపించింది. ఇక ఇప్పుడు అనసూయ వంతు వచ్చింది. తాను పెంచుకునే చిలకతో ముద్దులాడుతూ కనిపించింది. ఈ వీడియో తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసేసరికి ఇప్పుడది వైరల్ అవుతోంది. "షూటింగ్ లేని టైములో ఇలా రిలాక్స్ అవుతాను" అంటూ అనసూయ గతంలో ఒక వీడియోలో చెప్పింది. ఇప్పుడు అనసూయ తాను పెంచుకునే పెట్స్ తో ఫుల్ రిలాక్స్ అవుతూ ఉంటుంది అనసూయ.

ఆమె తన పిల్లలు, పెట్స్ తో కలిసి ఒక పార్క్ లో సందడి చేసింది. అనసూయ తాను పెట్స్ కి మంచి పేర్లు పెట్టి పిలుస్తుంది, అవి కూడా పలుకుతాయి. ఇక తన దగ్గర ఉన్న మాట్లాడే చిలక పేరు హ్యాపీ అన్నమాట. ఇక హ్యాపీ కి హాయ్ చెప్పి 'ఐ లవ్ యు' చెప్పింది ఆ చిలక కూడా అనసూయతో తిరిగి "ఐ లవ్ యూ" చెప్పేసింది. ఆ మాటకు చిలకకు ముద్దులు ఇచ్చేసింది అనసూయ. చిలక కూడా అలాగే ముద్దులు పెట్టింది. అనసూయ హ్యాపీకి, హ్యాపీ అనసూయకి ఇచ్చుకున్న ముద్దులు, చెప్పుకున్న "ఐ లవ్‌ యూ"వీడియో అందరినీ ఆకర్షిస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.