English | Telugu

ట్విట్టర్ లో మళ్లీ అనసూయ రచ్చ... ముదిరిన గొడవ!

అనసూయ భరద్వాజ్.. అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై తన యాక్టింగ్ తో, యాంకరింగ్ తో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర తనకి ఎంతగా పేరు తెచ్చిందో అందరికి తెలిసిందే. అయితే అటు సినిమాలలో బిజీగా ఉంటూనే వీకెండ్ లో ఫ్యామిలీతో గడుపుతుంటుంది ఈ భామ.

అయితే కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో తనని ఎవరో ఆంటీ అన్నారని.. దానికి తీవ్రంగా స్పందించింది అనసూయ. దాని తర్వాత అనసూయ కొంతకాలంగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ వస్తోంది. అయితే తాజాగా తన కొత్త సినిమా 'విమానం' ప్రమోషన్స్ లో భాగంగా ఒక పోస్టర్ పెట్టి.. వెయిటింగ్ అని పెట్టింది. అయితే అక్కడ వరకు బానే ఉంది. తాజాగా విజయ్ దేవరకొండ కొత్త సినిమా 'ఖుషి' పోస్టర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. దానిని విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అయితే అందులో విజయ్ పేరుకి ముందు 'The' అని ఉంది. అంటే The Vijay Devarakonda.. అని ఉంది. ఆ విషయాన్ని టార్గెట్ చేస్తూ అనసూయ తన ట్విట్టర్ లో పరోక్షంగా ఒక పోస్ట్ చేసింది. పేరు ముందు 'THE' చూశాను.. అదేం పైత్యమో.. మనకెందుకు అంటకుండా చూసుకుందామని అనసూయ ట్వీట్ చేసింది. ఇక అక్కడితో మొదలైంది ఈ రచ్చ.

అనసూయ ట్వీట్ ని చూసిన విజయ్ దేవరకొండ అభిమానులు.. అనసూయని ట్యాగ్ చేస్తూ.. తనని తిట్టుకుంటూ వరుసగా ట్వీట్లు చేయడం స్డార్ట్ చేసారు. అయితే అనసూయ తనని తిట్టిన వాళ్ళందరి పోస్ట్ లను చూస్తూ.. వాటికి తగ్గట్టు కౌంటర్ వేస్తూ ట్వీట్లు చేస్తుంది. అయితే తాజాగా మరొక ట్వీట్ చేసింది అనసూయ. ఎంతమంది చేసినా తప్పు తప్పే అవుతుంది.. ఒక్కరే చేసినంత మాత్రాన ఒప్పు ఒప్పుకోకుండా పోదు అని ఒక ట్వీట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ చూసిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మళ్ళీ తనపై రీట్వీట్ లు చేస్తూ, అనసూయని తిడుతూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ పోస్ట్ లకి ఇప్పటివరకు విజయ్ దేవరకొండ మాత్రం స్పందించలేదు. ప్రస్తుతం ఈ వివాదం వైరల్ గా మారింది. కాగా అనసూయ, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ మాటల యుద్ధం ఎప్పటివరకు సాగుతుందో చూడాలి మరి!

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.