English | Telugu
ఇంట్లో గొడవ అవుతుంటే వీడియో తీసింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!
Updated : Jan 25, 2024
ప్రతీ ఒక్కరి ఇంట్లో గొడవలు కామన్. అక్కచెల్లెళ్ళ గొడవ, అన్నాతమ్ముళ్ళ గొడవ జరుగుతుంది. అయితే ఇంట్లో అమ్మ తిట్టే తిట్లు అందరు ఫేస్ చేసినవే. అవన్నీ ఓ వయసొచ్చాక మెమరీలా ఉంటాయి. అయితే అనుకోకుండా జరిగిన గొడవని రీతు చౌదరి ఓ వ్లాగ్ ని చేసింది.
కొన్ని రోజుల క్రితం తన బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి ప్యారిస్ కి వెళ్ళిన రీతూ చౌదరి.. అక్కడ అసలు విషయం చెప్పింది. తన బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదంటు విష్ణుప్రియే తన ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అంటు చెప్పుకొచ్చింది. అయితో తాజాగా చేసిన " ప్యారిస్ లో విష్ణుకి నాకు గొడవ అయింది " అనే వ్లాగ్ చేసింది. ఇప్పుడేమో " మా ఇంట్లో గొడవ అవుతుంటే ఎవరికి తెలియకుండా వీడియో తీసాను" అనే వ్లాగ్ ని తన యూట్యూబ్ లో అప్లోడ్ చేసింది. ఇందులో రీతూ చౌదరి వాళ్ళ అమ్మ ఇంట్లో చికెన్ కర్రీ చేస్తుంటే రీతూ మధ్యలోకి వెళ్ళి కావాలని గొడవ జరగాలని కారం బాగా వేసింది. దాంతో వాళ్ళ అమ్మకి తనకి గొడవ జరిగింది. అలాగే వాళ్ళింటికి బంధువులు రావడంతో వారికి పెట్టకుండా తనే ముందు తినేస్తుందని తనకి మర్యాదలు తెలియవని రీతూ వాళ్ళ అమ్మ సరదాగా అనేసింది.
రీతు చౌదరి దావత్ అనే ఓ షోకి యాంకర్ గా చేస్తుంది. అయితే ఈ దావత్ షోలో ఎపిసోడ్ నెంబర్-5 లో సోహెల్ గెస్ట్ గా వచ్చాడు. ఇందులో రీతు చౌదరి అడిగిన కొన్ని బోల్డ్ ప్రశ్నలకి సోహెల్ ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చాడు. ఇప్పుడు అవన్నీ ఇన్ స్ట్రాగ్రామ్ లలో రీల్స్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. అయితే రీతు చౌదరి వాళ్ళ నాన్న చనిపోయాక తను చేసిన ఓ వీడియో అప్పట్లో వైరల్ గా మారగా.. ఈ దావత్ షోకి యాంకర్ గా తను అడిగే ప్రశ్నలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందం, అభినయం, ఇతర టాలెంట్లతో కొంతమంది సెలెబ్రిటీలు ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ ఫేమ్ రీతూ చౌదరి ఒకరు. ఎప్పుడు ఏదో హాట్ ఫోటో షూట్ తో రీతూ చౌదరి వార్తల్లో నిలుస్తుంది.