English | Telugu

తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజి పై మెరిసిన బన్నీ!

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి అల్లు అర్జున్ రాబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో ఆహా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. బ్లాక్ సూట్ లో పుష్ప దుమ్ము రేపుతున్నాడు. "ఐకానిక్" గ్రాండ్ ఫినాలే లోడింగ్...గెట్ రెడీ ఫర్ .నీ యవ్వ తగ్గేదే ల్యే లాంటి ఎంటర్టైన్మెంట్..!!అంటూ ఒక టాగ్ లైన్ పీతింది. " ఏ బిడ్డా ఇది నా అడ్డా" అనే సాంగ్ తో స్టేజి మీద ఎంట్రీ ఇచ్చారు అల్లు అర్జున్.

అల్లు అర్జున్ పుష్ప తర్వాత అదే రేంజ్ లో ఎక్కడా తగ్గకుండా పుష్ప2ను తీసుకురాబోతున్నారు సుకుమార్. ఇక ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా కనిపిస్తోంది, ఫహద్ ఫాజిల్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. పుష్ప 2 లో హిందీ స్టార్ రణవీర్ సింగ్ కనిపించనున్నారని సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ఫైనల్ లో కంటెస్టెంట్ జయరాంతో కలిసి అల్లు అర్జున్ ఒక స్టెప్ కూడా వేశారు. అలాగే థమన్, హేమచంద్ర అందరూ కలిసి స్టేజి మీద అల్లు అర్జున్ సాంగ్స్ కి డాన్సులు వేశారు. ఇకపోతే పుష్ప 2 మాత్రమే కాదు పుష్ప 3 కూడా ఉంటుందని ఇప్పటికే ఊహాగానాలు వస్తున్నాయి. అలాగే బన్నీ త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాతో కలిసి పాన్ ఇండియా మూవీస్ చేయబోతున్నారు. ఈ పుష్ప 2 లో అల్లు అర్జున్ బాడీ మొత్తం నీలం రంగు పూసుకుని చీర‌ కట్టుకుని, చేతికి గాజులు వేసుకుని ఓ చేతిలో గ‌న్ ప‌ట్టుకుని కనిపిస్తాడు. ఈ లుక్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. ఈ లుక్ మీద ఎన్నో రీల్స్ కూడా వచ్చాయి. అలాంటి అల్లు అర్జున్ ఈ తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజి మీద కనిపించి ఆడియన్స్ ని అలరించబోతున్నారు. మరి ఈ తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ ఎవరో తెలియాలంటే అల్లు అర్జున్ చేతుల మీద ఎవరు కప్ అందుకోబోతున్నారో తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.