English | Telugu
స్టేజి మీద ఏడ్చేసిన అకుల్ బాలాజీ.. ధైర్యం చెప్పిన భార్య!
Updated : Oct 8, 2022
డాన్స్ ఇండియా డాన్స్ సరికొత్తగా ముస్తాబవుతూ ప్రతీవారం ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఇప్పుడు ఈ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి "స్వాతిముత్యం" మూవీ టీమ్ నుంచి హర్షవర్ధన్, బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ వచ్చారు. ఇందులో చిన్న పిల్లలు కూడా రొమాంటిక్ పెర్ఫార్మెన్స్ చేసి జడ్జెస్ తో వావ్ అనిపించుకున్నారు.
నెల్లూరులో పుట్టిన షో హోస్ట్ అకుల్ బాలాజీ తన డ్రీమ్ కోసంతన లైఫ్ లో ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డాడో ఈ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ చేసి చూపించారు. ఈ పెర్ఫార్మెన్స్ తో అకుల్ చాలా ఎమోషనల్ అయ్యాడు. తర్వాత స్టేజి మీదకు అతని భార్య వచ్చి,"నీ కష్టానికి ఫలితం ఇప్పుడు వచ్చింది.. బాధపడకు" అంటూ ఓదార్చింది.
"మా నాన్న చెప్పారు ఆఖరి శ్వాస వరకు అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉండు అని.. నేను అలాగే చేస్తున్నా. నాన్నా నువ్ ఎక్కడున్నా.. నేను నువ్వు చెప్పిన కల కోసం కష్టపడుతున్నా" అన్నాడు బాలాజీ. ఈ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ చూసి "అన్న ప్రాసన రోజునే బిర్యానీ తిన్నట్టు ఉంది" అని కాంప్లిమెంట్ ఇచ్చాడు హర్షవర్ధన్.