English | Telugu

దివి కళ్లల్లోకి చూస్తూ క‌విత్వం ఒలికించిన ఓంకార్!

ఈ మధ్యకాలంలో బుల్లితెరపై వస్తోన్న ఎంటర్టైన్మెంట్ షోల సంఖ్య ఎక్కువవుతోంది. రోజుకో కొత్త రకం షో పుట్టుకొస్తోంది. అయితే వీటిల్లో ఓంకార్ హోస్ట్ చేసే షోలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయి. 'ఇస్మార్ట్ జోడీ', 'డాన్స్ ప్లస్', 'సిక్స్త్ సెన్స్' వంటి షోలతో ఓంకార్ ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. రీసెంట్‌గా డాన్స్ ప్లస్ షో పూర్తి చేసిన ఓంకార్ ఇప్పుడు సిక్స్త్ సెన్స్ నాల్గో సీజన్ ను మొదలుపెట్టాడు.

ఇప్పటివరకు జరిగిన మూడు సీజన్లలో టాలీవుడ్ సెలబ్రిటీలు, బుల్లితెర తారలు పాల్గొన్నారు. ఇప్పుడు నాల్గో సీజన్‌లో ఎక్కువగా టీవీ తారలను గెస్ట్ లుగా తీసుకొస్తున్నాడు. ఇప్పటికే హైపర్ ఆది, అనసూయ, అషురెడ్డి.. ఇలా చాలా మంది టీవీ తారలు ఈ షోలో సందడి చేశారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ లను ఈ షోకి అతిథులుగా తీసుకొచ్చారు.

అఖిల్ సార్థ‌క్‌, దివి వ‌డ్త్య‌ ఈ షోకి వచ్చారు. తన 'వన్ సెకండ్' కాన్సెప్ట్ తో అఖిల్ ని బాగా టెన్షన్ పెట్టేశాడు ఓంకార్. బిగ్ బాస్ ఫైనల్స్ సమయంలో కూడా ఇంత టెన్షన్ పడలేదని అఖిల్ అన్నాడు. 'నీలో ఇన్ని షేడ్స్ ఏంటన్నా.. అపరిచితుడు నువ్' అంటూ ఓంకార్ పై కామెంట్ చేశాడు. ఆ తరువాత 'నాగిన్' పాటకు తనదైన స్టైల్ లో డాన్స్ వేసి ఆకట్టుకుంది పొట్టి డ్ర‌స్‌లో వ‌చ్చిన‌ దివి. ఆ తరువాత దివి కళ్లల్లోకి చూస్తూ "మెస్మరైజింగ్ లాంటి కళ్లు నీవి. అందుకే నీకు పెట్టారు పేరు దివి" అంటూ ఓంకార్ కవిత్వం ఒలికించాడు. యాంక‌రింగే కాదు, ఓంకార్‌లో ఈ క‌ళ కూడా ఉందన్న మాట.. అంటున్నారు నెటిజ‌న్లు.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.