English | Telugu

జిమ్‌లో అరియానాతో ఆర్జీవీ రచ్చ! ఫొటోలు వైర‌ల్‌!!

యాంకర్ అరియానా అంటే జనాలకు పెద్దగా తెలిసేది కాదు. కానీ అమ్మడు ఎప్పుడైతే దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసిందో.. ఒక్కసారిగా పాపులర్ అయింది. అరియానా డ్రెస్సింగ్, ఆమె శరీరాకృతిపై రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ చేయడం.. దానికి ఆమె సిగ్గు పడడం అవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆమెకి బిగ్ బాస్ షోలో అవకాశం కూడా వచ్చింది. ఇప్పుడు ఆమెకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆర్జీవీ పుణ్యమా అని ఆమెకి సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో అరియనా ఉన్నప్పుడు కూడా వర్మ ఆమెకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. మొత్తానికి ఆర్జీవీ, అరియనాల బంధం ఆలా కొనసాగుతూనే ఉంది. బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన తరువాత కూడా అరియనా.. ఆర్జీవీను కలిసింది. తాజాగా మరోసారి వీరిద్దరూ కలుసుకున్నారు.

జిమ్‌లో ఉన్న ఆర్జీవీను ఇంటర్వ్యూ చేయడానికి అరియానా వెళ్లిందట. ఇంటర్వ్యూ అనంతరం ఇద్దరూ కలిసి వర్కవుట్లు చేశారట. ఈ మేరకు వర్మ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. అందులో ఆయ‌న షేర్ చేసిన ఫొటో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. అందులో జిమ్ సూట్‌లో ఉన్న‌ అరియానా ఒక డంబుల్ ప‌ట్టుకొని ఉంటే, ఆర్జీవీ త‌న కండ‌ల్ని ప్ర‌ద‌ర్శిస్తూ మ‌రో డంబుల్‌ ప‌ట్టుకొని ఉన్నాడు. "The BIG BOSS ‘S LITTLE GIRL @ariyanaglory came to interview me in GYM ..AFTER INTERVIEW we did WORKOUT 😎😎 COMING SOON." అని రాసుకొచ్చాడు వ‌ర్మ‌.

అలాగే అరియానా త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పెట్టిన మ‌రో ఫొటో మ‌రింత‌గా నెటిజ‌న్స్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది. అందులో అరియానా డంబుల్స్ ప‌ట్టుకొని ఉంటే, ఆమె వెనుక ఆనుకొని నిల్చొని, డంబుల్స్ ప‌ట్టుకొని ఉన్న అరియానా చేతుల్ని త‌న చేతుల్తో ప‌ట్టుకొని కండ‌లు ప్ర‌ద‌ర్శిస్తున్నాడు ఆర్జీవీ. "మీరేమ‌నుకున్నా ఫ‌ర్వాలేదు, ఇది నాకోసం నేను చేస్తున్నాను. జ‌నం వాళ్ల‌నుకున్న విధంగా న‌న్ను చిత్రించుకుంటారు. కానీ నేనేమిట‌నేది అర్థం చేసుకోవ‌డానికి నాకు స‌న్నిహితం అయ్యేదాకా న‌న్ను అన‌లైజ్ చేయ‌కండి, నేనేమిట‌నేది చెప్ప‌కండి. మీరు న‌న్ను ఇష్ట‌ప‌డ్డా, ద్వేషించినా ఫ‌ర్వాలేదు. మీరు న‌న్న‌ర్థం చేసుకున్న‌ట్ల‌యితే మంచిగా ఫీల‌వుతాను. నేను విధిని న‌మ్ముతాను. ఆర్జీవీ స‌ర్‌కు ఎప్ప‌టికీ కృత‌జ్ఞురాలినై ఉంటాను. ఒక ఇంట‌ర్వ్యూ నా జీవితాన్నే మార్చేసింది. ఆర్జీవీ సార్‌తో క్రేజీ చిట్ చాట్‌తో త్వ‌ర‌లో మీ ముందుకు వ‌స్తాను." అని రాసుకొచ్చింది అరియానా.