English | Telugu
తను హైదరాబాద్ ని చాలా మిస్ అవుతుందంట!
Updated : Aug 13, 2023
నటి రాధ.. ఒకప్పుడు తన అందం, అభినయం, నాట్యంతో మ్యాజిక్ చేసింది. హీరోలతో సమానంగా డ్యాన్స్ చేయగల నటి. తొంభైల్లో యాక్టివ్ గా ఉన్న రాధ.. తర్వాత పెళ్ళి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. రీసెంట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. బిబి జోడీలో జడ్జ్ గా చేసి అందరికి దగ్గరైంది. బిబి జోడీలో తరుణ్ మాస్టర్, సదాతో కలిసి జడ్జ్ మెంట్ ఇస్తూ డ్యాన్సర్స్ కి కొన్ని టిప్స్ ఇస్తూ అదే గ్రేస్ ని కనపబరిచింది రాధ.
రాధ తన సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టిన తర్వాత సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ వస్తుంది. రాధ పలు షోస్ లో జడ్జ్ గా వ్యవహరిస్తుంది. షోస్ లో అప్పుడప్పుడు తన డాన్స్ తో అదరగొడుతుంది. ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ కి రీల్స్ చేసి తన క్రేజ్ ని మరింత పెంచుకుంటుంది.
అయితే రాధ రీసెంట్ గా ట్రావెలింగ్ అంటూ అన్ని రాష్టాలు తిరుగుతూ కనిపిస్తుంది. మొన్న ఊటి వెళ్తూ వడాపావ్ కోసం ఆగినట్టు, తనకి వడాపావ్ ఫేవరేట్ అని చెప్పింది రాధ. బిబి జోడీ తర్వాత 'నోతోనే డ్యాన్స్' షో కి జడ్జ్ గా చేస్తున్న రాధ.. ఇప్పుడు ఈ షో ముగుస్తుందని బాధపడుతుంది. ఈ షో తర్వాత తను హైదరాబాద్ లో ఉండదంట. చెన్నైకి వెళ్లిపోతుందంట.. అందుకే ఇక్కడివాళ్ళని మిస్ అవుతున్నట్టుగా.. 'మిస్ యూ హైదరాబాద్' అంటూ ఒక వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది రాధ. ఇలా తెలుగువాళ్ళతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటుంది రాధ.