English | Telugu

పెళ్లి వేడుకలో ప్రగతి రచ్చ...తీన్మార్ కి తగ్గట్టు బాడీ మూమెంట్స్!

ప్రగతి ఆంటీ గురించి అందరికీ తెలుసు..జిమ్ లో రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తూ సోషల్ మీడియాని ఈ వయసులో కూడా షేక్ చేసేస్తున్న బ్యూటీగా పేరు తెచ్చుకుంది.అందం, ఆరోగ్యం విషయంలో ప్రగతి చాలా కేర్ తీసుకుంటుంది. ఫిట్ నెస్ విషయంలో హీరోయిన్స్ తో పాటు పోటీ పడుతూ ఉంటుంది.

ఇక ఇప్పుడు ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె ఎనర్జీ చూస్తే మైండ్ బ్లాంక్ ఐపోతుంది. తన చెల్లెలి పెళ్ళి జరుగుతుండగా పూనకం వచ్చినట్లు మాస్ డాన్స్ చేశారు. తీన్మార్ బీట్ ఎక్కడ వినిపించినా ఎవ్వరైనా డాన్స్ చేసేస్తారు. మరి ప్రగతి ఆంటీ ఊరుకుంటుందా డోలు మీద కూర్చుని మరీ బీట్ కి తగ్గట్టు బాడీ మూమెంట్స్ చేసి పెళ్లిలో రచ్చ చేశారు. ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసి.. “ ఇది నా చెల్లి పెళ్లి. ఇంత సౌండ్ విన్నాక సైలెంట్ గా ఉండడం అనవసరం. అందుకే ఇలా పిచ్చిగా డాన్స్ చేస్తున్నా” అని టాగ్ లైన్ పెట్టింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.