English | Telugu

ఘనంగా పూర్ణ సీమంతం వేడుకలు

షామ్నా కాసిమ్ అలియాస్ పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో మూవీస్ లో హీరోయిన్ గా నటించింది...కొన్ని మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసింది. లాస్ట్ ఇయర్ జూన్ లో దుబాయ్‌కి చెందిన బిజినెస్ మేన్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకుంది. కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ ఫామిలీ మెంబర్స్ ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తాను గర్భం దాల్చినట్టు యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులకి పూర్ణ చెప్పింది. ఇప్పుడు పూర్ణ ఇంట్లో బేబీ షవర్ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఫొటోస్ ని పూర్ణ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది.

పూర్ణ ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు టీవీల్లో కూడా కొన్ని షోస్‌లో జడ్జిగా వ్యవహరించింది. పూర్ణ సీమంతం ఫంక్షన్ కి వాళ్ళ రిలేటివ్స్ అంతా వచ్చారు. పళ్ళు , పూలు ఇచ్చి తీపి తినిపించి అందరూ ఆమెను ఆశీర్వదించారు. పూర్ణకి ఎంతో ఇష్టమైన చేచి కూడా వేడుకకు రావడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. తన ఫంక్షన్ కి వచ్చిన వాళ్లంతా కూడా "ఆ అల్లా దయ నీ మీద, నీ బిడ్డ మీద ఎల్లప్పుడూ ఉండాలి" అంటూ విష్ చేశారు. పూర్ణ కూడా అందరికీ థ్యాంక్స్ అని చెప్పింది. పూర్ణ దశాబ్దానికి పైగా తెలుగు, తమిళ్, మలయాళం సినిమాల్లో నటించింది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'అఖండ'లో ఒక రోల్ లో నటించింది. మరి త్వరలో పూర్ణ ఒడిలోకి ఒక బిడ్డ రాబోతుందంటూ ఆమె ఫాన్స్, నెటిజన్స్ ఆమెను విష్ చేస్తున్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.