English | Telugu

రష్మీని పొగిడేసిన లైలా

సుడిగాలి సుధీర్ తర్వాత ఇప్పుడు బుల్లితెర మీద ఎక్కువగా వినిపిస్తున్న పేరు రష్మీ గౌతమ్. ఇప్పుడు షోస్ తో ఫుల్ బిజీ ఐపోయింది రష్మీ. కొన్నేళ్లుగా ఎక్స్ట్రా జబర్దస్త్ కి యాంకర్ గా చేస్తోంది. ఐతే ఇటీవల అనసూయ జబర్దస్త్ షో నుంచి తప్పుకునేసరికి అనసూయ ప్లేస్ లో రష్మీని యాంకర్ తీసుకొచ్చింది మల్లెమాల టీమ్. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ తో వారానికి మూడు రోజులు ఎంటర్టైన్ చేస్తోంది రష్మీ. ఇదే టైంలో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

ఈ షో చేయడం సంతోషమే నాకు కానీ నా ప్లేస్ లో కొత్త యాంకర్ వచ్చి ఎంటర్టైన్ చేసేవరకు ప్లీజ్ నన్ను కాస్త భరించండి అనేసరికి లైలా మంచి కామెంట్ ని పోస్ట్ చేశారు. "నువ్వు రాక్ స్టార్ వి..నువ్ ఏ షో చేసిన దానికి ప్రాణం పోస్తావు. యూ విల్ రాక్ ది షో" అనే కామెంట్ పెట్టేసరికి థ్యాంక్యూ అంటూ రిప్లై ఇచ్చింది రష్మీ. లైలా గతంలో జబర్దస్త్ షోకి జడ్జిగా కొద్ది రోజులు వచ్చి సందడి చేశారు. అలా రష్మీకి, లైలాకి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. రష్మీ గతంలో కొన్ని సినిమాల్లో కూడా నటించింది. కానీ అక్కడ రాని పేరు బుల్లితెర పై బాగా వచ్చింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.