English | Telugu

కొత్త ఇంట్లోకి నటి జ్యోతి..విషెస్ చెప్తున్న ఫాన్స్

సినీ న‌టి జ్యోతి అంటే ప్ర‌త్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమధ్య మూవీస్ లో పెద్ద‌గా క‌న‌ప‌డ‌ట్లేదు గానీ.. ఒక‌ప్పుడు మాత్రం ఆమె బోల్డ్ క్యారెక్టర్స్ లో బాగా నటించి హాట్ బ్యూటీ గా ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న జ్యోతి. సినిమాల్లో కనిపించకపోతే మాత్రం ఏముంది కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా ఈమె కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబందించిన ఒక వీడియోలో అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా అలంకరించుకుని హోమం ముందర కూర్చుంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. " రావాల్సింది ఏదైనా వస్తుంది, పోవాల్సింది ఏదైనా పోతుంది..కానీ ఈ హోమం తర్వాత చాలా ప్రశాంతంగా ఏదో దైవత్వం నాలో ప్రవేశించినట్టు ఉంది" అని ఇంగ్లీష్ లో కాప్షన్ పెట్టి పోస్ట్ చేసింది. జ్యోతి పోస్ట్ చేసిన ఈ వీడియోని చూసిన నెటిజన్స్ "కంగ్రాట్యులేషన్స్ ఫర్ న్యూ హౌస్, నేను మీ బిగ్ ఫ్యాన్ ని నన్ను ఎందుకు ఇన్వైట్ చేయలేదు" అని అడుగుతున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.