English | Telugu

మెర్సిడెస్ బెంజ్ కారు కొన్న నటి అస్మిత

అస్మిత అంటే తెలియని తెలుగు ఆడియన్స్ ఉండరు. అటు సీరియల్స్ తో, ఇటు మూవీస్ తో ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. సీరియల్స్‏తో బిజీగా ఉన్న టైంలోనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇంట్రెస్టింగ్ వీడియోస్ షేర్ చేసుకునేది అస్మిత. యష్ ట్రిక్స్ పేరుతో ఆమె ఓపెన్ చేసిన ఛానల్ కి చాల తక్కువ సమయంలోనే మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. "అగ్నిసాక్షి" సీరియల్ లో విలన్ గా చేసిన అస్మిత తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినా చేయకుండా సీరియల్స్ కి గుడ్ బై చెప్పేసింది. అలాంటి అస్మిత ఇప్పుడు ఒక కార్ కొని తన ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. అస్మిత తన భర్త సుధీర్ ని, వాళ్ళ అమ్మా, నాన్న చెల్లి , తన ఫ్రెండ్స్ అందరినీ వెంటబెట్టుకుని తీసుకెళ్లింది. తన చిన్నప్పటినుంచి డ్రీం కార్ ఐన వైట్ మెర్సిడెస్ బెంజ్ ని కొన్నారు.

మేము మా ఫస్ట్ లగ్జరీ కార్ కొనుక్కున్నాం. మన ప్లాన్స్ కన్నా ఆ దేవుడు ప్లాన్స్ చాలా ట్విస్టింగ్ గా ఉంటాయి కదా..కాబట్టి ఆయన్ని నమ్మండి చాలు అని చెప్పింది అస్మిత. అందరూ షోరూంలోనే పండగ చేసుకున్నారు. కేక్స్ తెప్పించుకుని తిన్నారు. అస్మిత వాళ్ళ అమ్మ కొంచెం ఎమోషనల్ అయ్యింది. "మేము మా పేరెంట్స్, ఆ దేవుడికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం ప్రత్యేకంగా ఆడియన్స్ కి మీరు లేకపోతె మేము లేము..మా కంటెంట్ మీరు చూసారు...మమ్మల్ని డెవలప్ చేశారు.. " అని చెప్పారు. అస్మిత తన అమ్మను కార్ లో కూర్చోబెట్టి స్టార్ట్ చేయించింది. ఈటీవీలో ఒకప్పుడు ప్రసారమైన 'పద్మవ్యూహం' సీరియల్ తో పాటు ఎన్నో సీరియల్స్ లో అస్మిత నటించింది. అలాగే మహేష్ బాబు నటించిన మూవీ 'మురారి'లో ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించింది. కొంతం కాలం క్రితంఆమె A1 From Day 1 అనే వెబ్ సిరీస్ ను కూడా రోపొందించారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.