English | Telugu

అందరి గురించి నా‌ జీవితంలో అన్నీ త్యాగం చేశాను!

ఆట సందీప్-జ్యోతిరాజ్.. ప్రస్తుతం క్రేజ్ లో ఉన్న కొరియోగ్రాఫర్స్. సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి డాన్స్ కి క్రేజ్ ఉంటుంది. లాక్ డౌన్ లో కూడా వీళ్ళిద్దరు కలిసి చేసిన డ్యాన్స్ వీడీయోలు తెగ వైరల్ అయ్యాయి. ఆట షోతో వెలుగులోకి వచ్చిన వాళ్ళిద్దరు.. ప్రస్తుతం ప్రతీ ఈవెంట్ లో, మూవీ ఆడియో ఫంక్షన్స్ అంటు ఎక్కడ చూసిన ఈ జోడినే కన్పిస్తుంది. అందరు వీళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక ప్రెస్ మీట్ లో స్టేజ్ మీద సందీప్ జ్యోతీల మధ్య సాగిన సంభాషణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. భార్య ఉండగా ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తే తప్పేంటి అంటూ మాట్లాడిన సందీప్ మాటలకి జ్యోతి మంచి కౌంటర్ వేసింది. దాంతో ఆ జంట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నారు.

ఆట సందీప్-జ్యోతిరాజ్ ఒక ఇంటర్వ్యూలో వారిద్దరు కెరీర్ లో సెటిల్ అవ్వడానికి పడిన కష్టాలు చెప్పుకొచ్చారు. సందీప్-జ్యోతిరాజ్ లది లవ్ మ్యారేజ్ వాళ్ళ పెళ్ళి అయి పది సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే జ్యోతి ఇప్పుడిప్పుడే తనకిష్టమైన డ్యాన్స్ పై పూర్తి సమయాన్ని కేటాయిస్తుందంట. ఇన్ని రోజులు తన డ్రీంని, ఫ్యాషన్ ని అందరి కోసం త్యాగం చేసినట్టుగా చెప్పింది. "ప్రతి ఆడపిల్లకి కొన్ని కోరికలు, కలలుంటాయి. అది అందరూ అర్థం చేసుకోలేరు. నీ డ్రీం ఏంటని అడిగి తెలుసుకోగలగాలి. చిన్నప్పటి నుండి నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఆడపిల్లకి డ్యాన్స్ ఏంటి? పెళ్లి చేసుకోమని పేరెంట్స్ అన్నారు. సరే అని పెళ్లి చేసుకున్నాను. అప్పుడు వాళ్ళ గురించి నా కలని త్యాగం చేశాను. పెళ్లి అయ్యాక ఆడపిల్లకి డ్యాన్స్, షోస్, ఈవెంట్స్ అవన్నీ ఎందుకని ఇంట్లో అనేవారు. అప్పుడు సందీప్ సపోర్ట్ కూడా ఉండేది కాదు. ఆడపిల్ల అంటే పెళ్లి చేసుకోవాలి.. పిల్లల్ని కనాలి.. వాళ్ళని చూసుకోవాలి.. అదేనా ఆడపిల్ల జీవితంలో తనకంటు కొన్ని కలలు ఉంటాయని తెలుసుకోలేరా? సందీప్ నన్ను ఇప్పుడు అర్థం చేసుకొని సపోర్ట్ గా ఉన్నాడు" అని జ్యోతి చెప్పుకొచ్చింది.

మాకు ఒక బాబు ఉన్నాడు. ఇప్పుడేమో సెకండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడని అందరు అడుగుతున్నారు. ఇప్పుడే నా డ్రీంని నిజం చేసుకుంటున్నాను. మళ్ళీ ప్రెగ్నెంట్ అంటే కష్టం. నాకు బాబు పుట్టినప్పుడు ఆ బాబుతో ఆరు సంవత్సరాలు ఉన్నాను. బిడ్డని కని కేర్ టేకర్ కి వదిలేయలేం కదా.. ప్రతీ తల్లి తన బిడ్డతో అయిదు సంవత్సరాలైన ఉండాలి. నాకు బాబు పుట్టిన తర్వాత నా బాడీ డ్యాన్స్ చెయ్యడానికి సెట్ కాలేదు. మళ్ళీ సెట్ కావడానికి నాకు నాలుగు సంవత్సరాలు పట్టింది. అందుకే ఇప్పుడు నేను డ్యాన్స్ పైనే దృష్టిపెడతాను. పాపం సందీప్ కి పాప అంటే చాలా ఇష్టం. పాప కావాలని అడుగుతున్నాడు. కానీ ఇప్పుడు కాదంటూ చెప్పుకొచ్చింది. ఇలా తన లైఫ్ లో జరిగిన విషయలు చెప్తూ ఎమోషనల్ అయింది జ్యోతి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.