English | Telugu

వేణుస్వామి పూజలు కిర్రాక్ ఆర్పీపై పని చేస్తాయా..?

అసలేం జరుగుతుంది.. బిగ్ బాస్ సీజన్-8 లో కంటెస్టెంట్స్ లిస్ట్ గురించి బయట సోషల్ మీడియాలో వచ్చే అప్డేట్స్ చూస్తుంటే బుర్ర హీటెక్కిస్తుంది. ఎందుకంటే ఏడ లేని సరుకంతా ఈడే ఉన్నట్టు ఎక్కడ లేని స్టఫ్ అంతా సోషల్ మీడియాలోనే ఉంటుంది.

సాధారణంగా బిగ్ బాస్ హౌస్‌లో ఇరవై మంది కంటెస్టెంట్స్ ఉంటేనే.. వామ్మో ఎవర్రా వీళ్లంతా అనే కామెంట్లు వినిపిస్తుంటాయి. అలాంటిది ఇప్పుడు సీజన్-8 లో అంతకు మించిన విచిత్రాలు చాలానే ఉండబోతున్నాయంట‌. బిగ్ బాస్ సీజన్-7 సూపర్ హిట్ అయ్యింది. ఈ సీజన్-7 విన్నర్‌గా పల్లవి ప్రశాంత్‌, రన్నర్‌గా అమర్‌ దీప్‌ నిలిచారు. అయితే స్పై అండ్ స్పా బ్యాచ్ మధ్య జరిగే ప్రతీ ఫైట్ , ప్రతీ వీక్ ఉత్కంఠభరితంగా సాగడం, హౌస్ లోని వాళ్ళంతా పోటాపోటీగా గేమ్స్ , టాస్కు లు ఆడటంతో అది సూపర్ హిట్ గా నిలిచింది. ఇక బిగ్ బాస్ సీజన్-8 సన్నాహాలు మొదలైపోయాయి. కంటెస్టెంట్స్ కోసం తెగ శ్రమిస్తున్నారంట మేకర్స్.

సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ లిస్ట్ లో బాగా వినిపిస్తున్న వాళ్ళు కొందరున్నారు. ఫార్మర్ నేత్ర, కిర్రాక్ ఆర్పీ, సుప్రిత, ముక్కు అవినాష్, కుమారీ ఆంటీ, కుషిత కళ్ళాపు ల పేర్లు ఎక్కువగా వినిపించగా.. గత రెండు రోజులుగా జ్యోతిష్కుడు వేణుస్వామి పేరు కూడా వినిపిస్తుంది. సెలబ్రిటీల గురించి ముందుగానే చెప్పి అవి నిజమ అవ్వడంతో చాలామంది హీరోయిన్లు అతని దగ్గరికి రావడం పూజలు జరిపించడం చేస్తుంటారు. అయితే తన భార్య కూడా శ్రీవాణి కూడా 'మంగళవారం' మూవీ సినిమాలోని థీమ్ మ్యూజిక్ ప్లే చేసి వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఇద్దరిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొస్తారా లేక వేణుస్వామి ఒక్కడినే తెస్తారా అనే నెట్టింట డిబేట్ జరుగుతుంది. ఒకవేళ తీసుకొస్తే అతనికి అత్యధిక రెమ్యునరేషన్ ఇస్తారంట. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారిన వేణుస్వామిని తీసుకొస్తారా లేదా రెమ్యునరేషన్ ఎక్కువగా ఇవ్వాలని డ్రాప్ అవుతారా చూడాలి మరి.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.