English | Telugu

య‌ష్‌..వేద క‌ర్టెన్ లో రొమాన్స్‌..

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీనియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా స్టార్ మాలో ప్ర‌సారం అవుతోంది. బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల, ఆనంద్, వ‌ర‌ద‌రాజులు, సులోచ‌న‌, మిన్ను నైనిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. వేద‌కు, య‌ష్ కు మ‌ధ్య వున్న దూరంగా తొలగించి వారికి ద‌గ్గ‌ర‌చేయాల‌ని ఖుషీ ప్లాన్ చేస్తుంది. బాబాయ్ వ‌సంత్ తో క‌లిసి తాత‌య్య‌, నానమ్మ‌, కాంచ‌ల‌ని బ‌ట‌యికి తీసుకెళ్లాల‌ని, త‌ద్వారా య‌ష్ , వేద‌ల‌కు ప్రైవ‌సీ ల‌భిస్తుంద‌ని ప్లాన్ చేస్తుంది ఖుషీ.

అనుకున్న‌ట్టుగానే అంద‌రిని వ‌సంత్ స‌హాయంతో బ‌య‌టికి తీసుకెళుతుంది. అదే స‌మ‌యంలో ఇంట్లో య‌ష్ , వేద వుండ‌గానే బ‌య‌ట తాళం వేయిస్తుంది. దీంతో ఇద్ద‌రు ఇంట్లోనే బందీ అయిపోతారు. ఆ త‌రువాత ఇద్ద‌రి మ‌ధ్య స‌ర‌దా సంభాష‌ణలు.. ఒక‌రికి గురించి ఒకరు తెలుసుకుంటారు. అదే క్ర‌మంలో ఇంట్లోకి దూరి దొంగ కార‌ణంగా మ‌రింత కామెడీ పుడుతుంది. ఇదిలా వుంటే వేద కర్టెన్ లు సర్దుతూ లాగ‌డంతో అవి మొత్తం వేద‌పై ప‌డ‌బోతుంటాయి. ఇది గ‌మ‌నించిన య‌ష్ వెంట‌నే వ‌చ్చి వేద‌ని ప‌క్క‌కు లాగేస్తాడు.

ఈ క్ర‌మంలో వేద‌, య‌ష్ క‌ర్టెన్ ల‌లో చిక్కుకుని కింద‌ప‌డిపోతారు. ఇద్ద‌రికి క‌ర్టెన్ లు చుట్టేసుకుని కింద‌ప‌డివుంటారు. ఇద్ద‌రు ఒక‌రిని ఒక‌రు చూసుకుంటూ వుండ‌గా అదే స‌మంలో బ‌య‌టికి వెళ్లిన మాళిని, ర‌త్నం, కాంచ‌న ఇంటికి చేరుకుంటారు. క‌ర్టెన్ ల మ‌ధ్య‌లో చుట్టుకుని వున్న య‌ష్ , వేద‌ల‌ని చూసి షాక్ అవుతారు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. మాళిని ఎలా రియాక్ట్ అయింది?...అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.