English | Telugu

పహల్గాం ఘటనలో మరణించిన వారికి జీ తెలుగు డ్రామా జూనియర్స్ కాండిల్ ట్రిబ్యూట్


పహల్గాంలో ఇటీవల జరిగిన ఘోరాన్ని ప్రపంచమంతా చూసింది. అక్కడ జరిగిన దారుణానికి చాలామంది సామాన్య ప్రజలు కూడా అవాక్కయ్యారు. ఆ ఘటనలో మృతి చెందిన వారి కోసం ప్రతీ ఒక్కరూ ప్రార్ధించారు. కొత్తగా పెళ్ళైన ఒక జంట పెహెల్గాం వెళ్లగా ఆ అమ్మాయి భర్తను ఉగ్రవాదులు మట్టుబెట్టారు. తన భర్త శవం పక్కన కూర్చున్న ఆ కొత్త పెళ్లి కూతురు చిత్రం ప్రపంచమంతా వైరల్ గా మారింది. ఇప్పుడు డ్రామా జూనియర్స్ సీజన్ 8 లోని చిన్నారులు ఒక స్కిట్ చేశారు. ఆ షో హోస్ట్ అండ్ జడ్జెస్ అంతా కలిసి కాండిల్స్ తో నివాళి అర్పించారు. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి సింగిల్ మూవీ టీమ్ నుంచి శ్రీవిష్ణు వచ్చాడు. అలాగే సంక్రాంతికి వస్తున్నాం మూవీ నుంచి బుల్లిరాజు కూడా గన్ పట్టుకుని వచ్చేసాడు.

"అసలు నేనెవరో నీకు తెలుసా..రోజా " అని రెండు చేతులు పైకెత్తి మరీ చెప్పింది. "నువ్వు రోజా ఐతే నేను రాజు బుల్లిరాజు" అన్నాడు ఆ పిల్లాడు. తర్వాత చిన్నారులంతా పహల్గాం నేపథ్యంలో ఒక స్కిట్ చేశారు. అందరూ ప్రకృతి అందాలను ఆరాధిస్తూ ఉండగా టెర్రరిస్టులు రావడం వాళ్ళను కాల్చేయడం వంటివి చేసి చూపించారు. ఇంతలో ఒక చిన్నారి వచ్చి "మాకు పెళ్ళై వన్ వీక్ అయ్యిందండి" అని చెప్పింది. "ఈ ఏడుపేదో మీ సర్కార్ దగ్గర ఏడువు" అంటూ ఆ పిల్లను పక్కకు నెట్టేసి ఆ కొత్తగా పెళ్ళైన అబ్బాయిని కాల్చేశారు. అంటే రియాలిటీలో ఏదైతే జరిగిందో దాన్ని చేసి చూపించారు. తర్వాత జడ్జెస్, హోస్ట్ అందరూ కలిసి ప్రాణాలర్పించిన వారికి కాండిల్ ట్రిబ్యూట్ ఇచ్చారు. ఇలాంటి ఘటనను ఇంతవరకు ఎవరూ ఊహించలేదు. కాశ్మీర్ అందాల మధ్య ఈ ఏడాది ఇలాంటి ఒక దుస్సంఘటన చోటు చేసుకోవడం మీద ప్రతీ ఒక్కరూ కూడా స్పందించి వారికి నివాళి అర్పించడం మనం చూసాం. ఇప్పుడు జీ తెలుగు కూడా ఈ షో ద్వారా వాళ్లకు ట్రిబ్యూట్ పలికింది.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.