English | Telugu

మిడ్ నైట్ మసాలా కోసం తాగుబోతు రమేష్ గొడవ!

జబర్దస్త్ ఎవ్రీ వీక్ ఏదో ఒక విధంగా నవ్వులు కురిపించడానికి ట్రై చేస్తోంది. కానీ ఇంతకు ముందు ఉన్న ఫన్, కామెడీ ఐతే ఉండడం లేదు..కానీ స్కిట్స్ మధ్యలో ఈ మూవీ ప్రొమోషన్స్ టీమ్స్ వస్తూండేసరికి వాళ్ళ వలన కొంచెం కామెడీ అనేది కవర్ అవుతోంది. ఇక ఈ వారం కూడా అలాగే జరిగింది. జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి "నారాయణ అండ్ కో" టీం ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ముందుగా రాకెట్ రాఘవ స్కిట్ పెర్ఫార్మ్ చేసాడు. వీళ్ళ టీం మొత్తం జెపిల్ ఆడారు. ఐతే జెపిఎల్ అంటే జబర్దస్త్ ప్రీమియర్ లీగ్ అని కూడా క్లారిటీ ఇచ్చాడు రాఘవ. టాస్ వెయ్యి అని రాఘవ అనేసరికి "తడా, పొడా" అని నాగి కౌంటర్ వేసాడు. ఛి ఏమిటా మాటలు ..మనమేమన్నా చింత చెట్ల కింద ఆడుతున్నామా అన్నాడు రాఘవ.

"వెదర్ ఎలా ఉంది అని రాఘవ అడిగేసరికి పది మార్కులు కూడా వచ్చేలా లేవు" అన్నాడు. తర్వాత తాగుబోతు రమేష్ టీమ్ స్కిట్ వేశారు.."ఆ కిరాణా షాప్ వాడితో గొడవ ఏమిటి అండి" అని రమేష్ భార్య అడిగేసరికి "ఇక్కడ అన్ని మసాలాలు అమ్మబడును అని వుంది కదా అని మిడ్ నైట్ మసాలా ఇవ్వండి" అని అడిగాను అనేసరికి అందరూ నవ్వేశారు. మధ్యలో వెంకీ మంకీస్ ఎంట్రీ ఇచ్చి "మొన్న దేవీ ప్రసాద్ గారు ఏమన్నారో తెలుసా ..వెంకీ నీకోసం ఒక కథ రాసాను హీరో చేద్దాం అన్నారు.." అని చెప్పాడు "నీలాంటి వాళ్ళ యాక్టింగ్ చూడలేకే యాక్టింగ్ ఎక్కడ చచ్చిపోతుందో అని చెప్పి డైరెక్టరే యాక్టర్ అయ్యాడు" అన్నాడు తాగుబోతు రమేష్. తర్వాత సద్దాం టీం దసరా మూవీ స్పూఫ్ చేసి ఫుల్ కామెడీ పంచారు. తర్వాత నారాయణ అండ్ కో మూవీ టీం నుంచి హీరో సుధాకర్ స్టేజి మీదకు వచ్చి డాన్స్ చేసాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.