English | Telugu

మీడియా ముందు నటించడం రాక ఆ కామెంట్స్ చేశా..త్వరలో నటించడం నేర్చుకుంటా


"లక్కీ లక్ష్మణ్" ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొన్ని నెగటివ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు సోహైల్. ఈ కామెంట్స్ మీద ఈ రోజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తాను చేసిన కామెంట్స్ విషయంలో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారని బాధపడ్డారు. తన వీడియోలపై సోషల్‌ మీడియాలో కామెంట్లు చూసినప్పుడు తనకు చాలా బాధ కలిగిందని, తనను మాత్రమే కాదు హీరోలపై ఇలాంటి కామెంట్లు చేస్తున్నారనే ఆవేదనలో స్టేజ్‌పై అలా మాట్లాడానని చెప్పారు. బయట మామూలుగా ఎలా మాట్లాడతానో, స్టేజ్‌ మీద కూడా అలానే మాట్లాడేశానని అన్నారు. తనకు నటించడం రాదు అని మీడియా ముందైనా బయటైనా ఒకలాగే ఉండడంపెద్ద సమస్యగా మారుతోందన్నారు.

ఇక మీదట కెమెరా ముందే కాదు బయట కూడా నటించాలేమో అని ఆవేదన వ్యక్తం చేశారు. జనాలు నెగటివ్‌నే ఎక్కువగా ఇష్టపడుతున్నారని, మా నాన్న పడిన కష్టంపై వీడియో పెడితే ఐదు వందల వ్యూస్ మాత్రమే వచ్చాయని, అదే ప్రీరిలీజ్ ఈవెంట్ లో స్టేజ్‌పై తాను చేసిన కామెంట్ల వీడియోలకు లక్షలకుపైగా వ్యూస్‌ వచ్చాయన్నారు. చిరంజీవి గారి వాల్తేర్‌ వీరయ్య ప్రెస్‌మీట్‌ వీడియోలకంటే తన నెగటివ్ కామెంట్స్ వీడియోకే ఎక్కువగా వ్యూస్‌ వచ్చాయన్నారు. సినిమాల్లో నటించడం ఈజీ కానీ స్టేజ్‌మీద, మీడియా ముందు నటించడం రావడం లేదు త్వరలో నేర్చుకుంటాను అన్నారు బిగ్‌ బాస్‌ ఫేస్‌ సోహైల్‌.

సోహైల్ నటించిన తొలి చిత్రం `లక్కీ లక్ష్మణ్‌` మూవీ డిసెంబర్‌30న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ అద్భుతమైన క్యూట్ లవ్ స్టోరీ అని చెప్పారు.

Podharillu : పోలీస్ స్టేషన్లో చక్రి, మహా.. భూషణ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -26 లో..... చక్రి, మహా ఇద్దరు కార్లో వెళ్తుంటే వాళ్ళని ఫాలో చేస్తూ మహా వాళ్ళ నాన్న ప్రతాప్ అతడి కొడుకు ఆది వెళ్తారు. వారితో పాటుగా మహాని పెళ్ళి చేసుకోవాలనుకునే భూషణ్ మరోచైపు ఫాలో చేస్తుంటారు. అయితే ఒక దగ్గర చక్రి , మహా వాళ్ళు దొరికిపోతారు. ఇక మహా వాళ్ళ నాన్న ప్రతాప్.. మహాని రమ్మని చెప్పగా.. ఆ జుట్టోడితో నా పెళ్ళి వద్దు అందుకే పారిపోతున్నానని మహా అంటుంది. చక్రిని చంపేసి నా కూతురిని తీసుకురమ్మని ప్రతాప్ అంటాడు. అప్పుడే వారి మధ్యలోకి బాలు కారులో వేగంగా వచ్చి ఆగుతాడు.