English | Telugu

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

మరొకవైపు స్వప్న భోజనం టేబుల్ పై పెట్టి కాశీకి తినమని చెప్పి వెళ్ళిపోతుంది. భార్యగా ఎలా ఉండాలో దీప అక్కని చూసి నేర్చుకోమని కాశీ అనగానే బాధ్యతగా ఎలా ఉండాలో మా అన్నయ్యని చూసి నేర్చుకోమని స్వప్న అంటుంది. ఆ తర్వాత కాశీ కోపంగా వైరాకి ఫోన్ చేసి నాకు జాబ్ ఇస్తానన్నారని అడుగుతాడు. ఇచ్చాను ముందు బోనస్ గా అయిదు లక్షలు పంపిస్తున్నానని వైరా చెప్తాడు. మరొకవైపు సుమిత్ర గురించి దీప బాధపడుతుంది. అప్పుడే కార్తీక్, కాంచన వస్తారు. మావయ్య బయటకు వచ్చాడా అని దీప అనగానే వచ్చాడని శౌర్య ముందు అబద్ధం చెప్తాడు కార్తీక్. శౌర్య వెళ్ళిపోయాక రాలేదని కార్తీక్ చెప్పగానే దీప బాధపడుతుంది ఎందుకు బాధపడ్డాం.. నీ ఐడియా వళ్లే కదా అయనకి ఆ పరిస్థితి వచ్చిందని కాంచన అనగానే దీప షాక్ అవుతుంది‌. ఇవి నా మాటలు కాదు.. మా పిన్ని ఫోన్ చేసి తిడుతుందని కాంచన అంటుంది.

మరొకవైపు తన అకౌంట్ లో డబ్బులు క్రెడిట్ అయ్యాయని స్వప్నకి కాశీ చూపిస్తాడు. స్వప్న అది చూసి షాక్ అవుతుంది. జనరల్ మేనేజర్ గా జాబ్ వచ్చింది. ఒక్క రోజులో అయిదు లక్షలు సంపాదించానని కాశీ పొగరుగా చెప్తాడు. మనం త్వరలో ఇల్లు తీసుకుంటున్నాం.. వెళ్లిపోతున్నాం ఇన్ని రోజులు మీ వాళ్ళు ఫుడ్ పెట్టినందుకు ఎంత కావాలో చెప్పమను ఇస్తానని కాశీ అనగానే స్వప్న షాక్ అవుతుంది.. ఆ తర్వాత కార్తీక్, దీపల దగ్గరికి స్వప్న వెళ్లి జరిగింది అంత చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.