English | Telugu

పెళ్లి కావాలి అంటూ సతాయిస్తున్న ఆది..తలపట్టుకున్న రాంప్రసాద్!

శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక రేంజ్ లో వెళ్తున్న షో. ఇప్పుడు ఈ షోకి సంబందించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించి ఈ స్పెషల్ ఈవెంట్ ని ఈ షోలో నిర్వహిస్తున్నారు. ఆదికి ఒక సౌందర్యలహరి కనిపించి కైపెక్కించి , నడుము మీద పెద్ద పుట్టుమచ్చ చూపించి ముఖం చూపించకుండా వెళ్ళిపోతుంది. ఇంతలో అక్కడికి రాంప్రసాద్ వస్తాడు. నాకు సౌందర్యలహరి కనిపించింది నాకు పెళ్లి కావాలి అంటూ కాసేపు హడావిడి చేస్తాడు. తర్వాత చిరంజీవి కూతురు వచ్చి మెగాస్టార్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో చూద్దామని వచ్చా అంటూ ఒక స్కిట్ కూడా పెర్ఫార్మ్ చేస్తుంది.

ఆది, నిహారిక మధ్య డైలాగ్ యుద్ధం జరుగుతుంది. అందరినీ నువ్వు దా..దా అని పిలుస్తున్నావ్ నన్ను దాదా అని పిలుస్తున్నావ్ అని అంటుంది. ఆది ప్రపంచంలోకెల్లా అతి కష్టమైన పని ఎంతో తెలుసా అంటే కౌంటర్లు వేసేవాళ్ళు మీద కౌంటర్లు వేసే వాళ్ళు వస్తే దాన్ని తీసుకోవడం అంటాడు ఆది. ఇక జబర్దస్త్ కమెడియన్ అశోక్ వచ్చి కీబోర్డ్ ప్లే చేసి అందరినీ మెస్మోరిజ్ చేస్తాడు. ఇక ఇందులో ఖుషి మూవీలో నడుము శీను వేస్తారు ఆది, రాంప్రసాద్. ఇక నవ్వులే నవ్వులు. ఇలా రాబోయే వారం శ్రీదేవి డ్రామా కంపెనీ అందరినీ అలరించనుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.