English | Telugu

గౌతమ్-శోభా శెట్టి మధ్య బిగ్ బాస్ పెట్టిన చిచ్చు.. అందుకే చొక్కా విప్పి చూపించాడా?



బిగ్ బాస్ హౌజ్ లో రోజురోజుకి హీటెడ్ ఆర్గుమెంట్స్ ఎక్కువవుతున్నాయి. నిన్నటి దాక యావర్-గౌతమ్ ల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. కాగా బుధవారం నాటి ఎపిసోడ్‌లో శోభా శెట్టి-గౌతమ్ ల‌ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇద్దరి మధ్య పీక్స్ లో గొడవ జరిగింది. హౌజ్ లో ఎవరూ తగ్గట్లేదు. ఎవరికి వారే ఇండివిడ్యువల్ గేమ్ ప్లాన్ తో చెలరేగిపోతున్నారు.

హౌజ్ లో కంటెస్టెంట్స్ గా ఉన్నవారిలో మూడవ హౌజ్ మేట్ కోసం మూడవ వారం జరుగుతున్న ఈ ప్రక్రియలో ఉల్టా పల్టా థీమ్ ని అప్లై చేస్తున్నాడు బిగ్ బాస్. మూడవ హౌజ్ మేట్ కోసం అమర్ దీప్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టిలని పోటీలో ఉంచాడు బిగ్ బాస్. ఆ తర్వాత హౌజ్ లోని ఒక్కో కంటెస్టెంట్ ని సీక్రెట్ రూమ్ కి పిలిచి, పోటీలో ఉన్న ఈ ముగ్గురిలో ఎవరు అనర్హులుగా భావిస్తున్నారో చెప్పమని చెప్పాడు బిగ్ బాస్. దాంతో మొన్న జరిగిన ఎపిసోడ్‌లో యావర్ ని దామిణి అనర్హుడని చెప్పడంతో.. ప్రాపర్ రీజన్ కావాలంటూ యావర్ గొడవకి దిగిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు సీక్రెట్ రూమ్ లో శోభా శెట్టి అనర్హురాలని గౌతమ్ కృష్ణ చెప్పింది చూపించాడు

బిగ్ బాస్. దాంతో వీళ్ళిద్దరి మధ్య గొడవ ముదిరింది. పుల్ రాజా పుల్ గేమ్ లో నీకంటే ఎక్కువ సేపు ఉన్నాను, ఆ రోజు కుస్తీ పట్టు టాస్క్ లో 58 సెకండ్స్ ఉన్నానంటూ శోభా శెట్టి తన పాయింట్లను చెప్పగా.. నువ్వు హౌజ్ లో ఎక్కువ కనిపించడం లేదు. అందరితో కనెక్ట్ అవ్వట్లేదు. ఎక్కువ టైమ్ మేకప్ వేకుంటున్నావ్.. అందుకే నాకు అలా అనిపించింది చెప్పాను అది నా రీజన్ అంటూ గౌతమ్ కృష్ణ అన్నాడు. నన్ను అలా ఎలా అంటావని శోభా శెట్టి, అది నా ఒపీనియన్, నా డెసిషన్ అంటూ గౌతమ్ కృష్ణ అన్నాడు.

నువ్వు చెప్పిన రీజన్.. బక్వాస్ రీజన్ అని శోభా శెట్టి అంది. మరి నేను జిమ్ చేస్తే నీకేంటి ప్రాబ్లమ్ అంటు గౌతమ్ కృష్ణ అన్నాడు. అందుకే నువ్వు ఏం చేయలేకపోయావ్ అని శోభా శెట్టి అంది. నా జిమ్ నా ఇష్ణం పొద్దున్న ఎత్తుతా, సాయంత్రం ఎత్తుతా, నా బాడీ నా ఇష్టమంటూ శోభా శెట్టి ముందు చొక్కా విప్పి జిమ్ చేశాడు గౌతమ్. చొక్కా విప్పి షో ఆఫ్ చేస్తే ఎవడు బయపడడని, పోరా పో అంటూ శోభా శెట్టి అనగా‌.‌. నన్ను బిగ్ బాస్ సెలెక్ట్ చేశాడు మా నాన్న సెలెక్ట్ చేయలేదంటూ గౌతమ్ కృష్ణ అన్నాడు. ఇలా ఇద్దరి మధ్య చాలా సేపు గొడవ జరిగింది. అయితే తనని అనర్హురాలని అలా ఎలా చెప్తాడనేది శోభా శెట్టి వాదనైతే, నా ఒపీనియన్ నా ఇష్టమని గౌతమ్ వాదన. అయితే ఈ ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అనేది బిగ్ బాస్ మూడవ హౌజ్ మేట్ ని ప్రకటించేప్పుడు చెప్తాడు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో వీరిద్దరి మధ్య జరిగిన గొడవ పీక్స్ లో ఉంది.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.