English | Telugu

దామిణి, రతికల పైశాచికత్వం.. ప్రిన్స్ యావర్ వన్ మ్యాన్ షో!

యావర్.. అన్వర్.. ప్రిన్స్. ఇవన్నీ పేర్లు ఒక్కడివే. అతనే ప్రిన్స్ యావర్. బిగ్ బాస్ హౌజ్ లో రతిక ఆడించే ఆటలో ప్రిన్స్ యావర్ ని అన్వర్ అని పిలుస్తుంది. హౌజ్ లో‌ కొంత మంది ప్రిన్స్ అని మరికొందరు యావర్ అని పిలుస్తున్నారు. అసలు విషయానికొస్తే ప్రిన్స్ యావర్ కి అదిరిపోయే కమ్ బ్యాక్ కంటెంట్ లభించింది.

బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్ నుండి హౌజ్ మేట్ గా మారడానికి అవకాశం లభించింది. యావర్, అమర్ దీప్, శోభా శెట్టిలని హౌజ్ మేట్ కోసం ఎంపిక చేయగా దామిణి, టేస్టి తేజ, రతిక అనర్హుడని సీక్రెట్ రూమ్ లో చెప్పారు. అయితే తనని తాను స్ట్రాంగ్ అని నిరూపించుకోవడానికి బిగ్ బాస్ అవకాశాన్ని ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలోని ఒక స్టాండ్ కి ప్రిన్స్ యావర్ ని తన చిన్ ని ఉంచి నిల్చోమన్నాడు. ఇక ప్రిన్స్ యావర్ ని ఎవరైతే అపోజ్ చేశారో వారిచేత భిన్నమైన పద్దతులలో, వాళ్ళకి నచ్చింది చేసి యావర్ ని ఒక గంటలో ఆ ప్లేస్ నుండి వచ్చేలా చేయాలని, ఏదో ఒకటి చేసి యావర్ ని ఓడించాలని చెప్పాడు బిగ్ బాస్. దాంతో దామిణి, రతిక కలిసి రకరకాల ప్రయోగాలు చేశారు. మొదట రతిక టమాటలు, ఎగ్స్ తెచ్చి యావర్ మోహంపై కొట్టింది. ఇక టేస్టి తేజ తెచ్చిన ఐస్ ని ప్రిన్స్ యావర్ డ్రాయర్ లో వేశారు.‌ ఇక రతిక అలియాస్ రాధిక జండు బామ్ ని యావర్ ముక్కుకి ఆనించి పైశాచికత్వాన్ని పొందింది. ఇక దామిణికి వైల్డ్ థాట్స్ వస్తున్నాయంటూ చిన్న చిన్న కట్టె పుల్లల్ని యావర్ ముక్కులో, చెవిలో పెట్టింది. అప్పటికైన సంచాలకులుగా చేస్తున్న ఆట సందీప్, శివాజీ వారికి అలా చేయొద్దని చెప్పాడు. అయినా వినకుండా అలానే చేశారు.‌

సబ్బు నీళ్ళు, సబ్బు నురగతో దామిణి తనకి నచ్చినట్టుగా యావర్ ని టార్చర్ చేసింది. కాసేపటికి పేడ నీళ్ళని చల్లారు. అయిన సరే ప్రిన్స్ యావర్ చలించలేదు. చివరివరకు స్ట్రాంగ్ గా నిల్చొని పోటీలో నిలిచి, తను యునిక్ అంటు నిరూపించుకున్నాడు యావర్. ఈ ఎపిసోడ్ తో ప్రిన్స్ యావర్ కి ఫ్యాన్ బేస్ పెరిగే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే తనని ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతున్నాడని, టీమ్ గా ఆడట్లేదని హౌజ్ లోని కంటెస్టెంట్స్ అనుకుంటుండగా మూడవ హౌజ్ మేట్ కోసం జరుగబోయే రేస్ లో స్థానం దక్కించుకున్నాడు ప్రిన్స్ యావర్. ఓటింగ్ లో అయిదు, ఆరు స్థానాలలో ఉన్న యావర్ గ్రాఫ్ పెరిగి మూడవ స్థానంలోకి చేరుకున్నాడు. టాస్క్ లతో పాటు తోటి కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ కమ్యూనికేషన్ ని పెంచుకుంటే టాప్-5 లో ఉండే అవకాశం ఉంది. ముందు ముందు ఎలా ఆడతాడో చూడాలి మరి!

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.