English | Telugu

నారి నారి నడుమ మురారి!

ఓటిటి వేదిక ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ గురించి అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ షోకి మంచి స్పందన లభిస్తోంది. మొదటి సీజన్ నుండి భారీ వ్యూయర్ షిప్ తో ఓటిటి లో తనకంటూ బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకొని, అన్ స్టాపబుల్ గా సీజన్-2 లోకి అడుగుపెట్టింది.

ఈ సీజన్-2 లో ఇప్పటికే అయిదు ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది. ఎపిసోడ్‌-6 లో జయప్రద, జయసుధ ఇద్దరు గెస్ట్ లుగా వచ్చారు. ఈ ఎపిసోడ్‌ లో బాలకృష్ణ వారిద్దరి మధ్యలో నిల్చొని 'నారి నారి నడుమ మురారి' అని అనడంతో షోలో నవ్వులు పూసాయి. "మీరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు?" అని బాలకృష్ణ అడిగాడు. "మొదట్లో షూటింగ్ లో కలిసాం. నేను తరచూ వాళ్ళింటికి వెళ్ళేదాన్ని.. వాళ్ళింట్లో తనని 'సుజాత' అని పిలిచేవాళ్ళు. తర్వాత నుండి నేను కూడా తనని సుజాత అనే పిలిచేదాన్ని" అని జయప్రద చెప్పింది. "అంతకు ముందు బాగా మాట్లాడుకునేవాళ్ళం. ఆ తర్వాత అడవి రాముడు సినిమాతో మేం బాగా క్లోజ్ అయ్యాం. మేమిద్దరం దాదాపు నలభై రోజులు ఒక ఫారెస్ట్ లో ఉన్నాం" అని జయసుధ చెప్పింది.

"ఇద్దరు కలిసి సినిమాల్లో నటించేవాళ్ళు. ఆ సినిమాల్లో ఎవరో ఒకరు హీరోని దక్కించుకునేవాళ్ళు..అలా నిజ జీవితంలో కూడా జరిగిందా?" అని బాలకృష్ణ అడిగేసరికి ఇద్దరు నవ్వుకున్నారు. ఆ తర్వాత బాలకృష్ణ వారిద్దరిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. వాళ్ళ స్నేహాన్ని పరీక్షించే ఒక గేమ్ ని ఆడించాడు. అందులో బాలకృష్ణ చిలిపి సమాధానాలు చెప్తూ.. షోలో నవ్వులు పూయించాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.