English | Telugu

కన్నీళ్లు పెట్టుకున్న శేఖర్ మాస్టర్

బుల్లితెరపై ఎన్ని షోస్ వచ్చి పోతున్నా ఢీ షోకి ఉన్న స్పెషాలిటీనే వేరు. సక్సెస్ ఫుల్ గా 17 సీజన్లను పూర్తి చేసుకున్న ఢీ షో రీసెంట్ గా ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2’ సీజన్ లో అడుగుపెట్టింది. ఈ షోకి శేఖర్ మాస్టర్, హన్సిక, గణేష్ మాస్టర్ జడ్జెస్ గా ఉన్నారు.. హైపర్ ఆది, శ్రీ సత్య టీమ్ లీడర్లుగా ఉన్నారు. ఈ షోలో డాన్సర్స్ ని జడ్జెస్ ని హైపర్ ఆది ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. కామెడీ, డ్యాన్స్ రెండూ ఈ షోలో ఉంటాయి. ఇక ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఆ ప్రోమో ఎండింగ్ లో శేఖర్ మాష్టర్ ఎమోషనల్ సీన్ ఉంది. తనకు డ్యాన్స్ అంటే ఎంత పిచ్చో అనే విషయాన్ని ఈ ప్రోమో ఎండింగ్ లో చెప్పుకొచ్చారు.

చాలా మంది ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు తాము వచ్చిన దారిని మర్చిపోరు. శేఖర్ మాస్టర్ కూడా అందులో ఒకరు. చేసే పనిని ఎంతో అంకితభావంతో పని చేయాలో ఆయన చెప్పారు. ఈ వారం ప్రొఫెషనల్ థీమ్ అనే కాన్సెప్ట్ ఇచ్చారు. ఇందులో బుల్లితెర నటుడు మధు కూడా ఒక డాన్స్ కంటెస్టెంట్. ఐతే ఆయన డాన్స్ చేస్తుండగా ఒక ప్రాబ్లమ్ ఐతే వచ్చింది. దాంతో ఆయన డాన్స్ చేయడం ఆపేసారు. అది చూసిన శేఖర్ మాస్టర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘ఇది కాంపిటీషన్ మధు. అతని మిస్టేక్ ఉన్నా నువ్వు కంటిన్యూ చేసేయాలి. మేము డాన్సర్స్ కదా.. మాకు డ్యాన్స్ తప్ప ఏమీ రాదు. డ్యాన్స్ మిస్ అయిపోతే మాస్టర్ ఎక్కడ వెళ్ళిపోతాడా? మాస్టర్ వెళ్ళిపోతే మాకెక్కడ ఫుడ్ పోయిద్దా ?’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి ఎన్నో సమస్యలన్నీ దాటుకుంటూ వస్తేనే ఇక్కడ ఉన్నాం అనే ఆయన ఉద్దేశాన్ని కన్నీళ్ల ద్వారా చెప్పుకొచ్చారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.