English | Telugu

నాకు నోరు తెరిస్తే ఏవేవో వస్తున్నాయి...

ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షో సీజన్ 4 లాంచింగ్ ఎపిసోడ్స్ లో లో కంటెస్టెంట్స్ ఇరగదీసి పాడుతున్నారు. ఇక నిహాల్ బందా అనే కంటెస్టెంట్ ఐతే జడ్జెస్ బాగా ఇంప్రెస్స్ చేసాడు. హైదరాబాద్ నుంచి వచ్చిన 19 ఏళ్ళ నిహాల్ గిటార్ మీద "గాలిలో ఊగిసలాడే దీపంలా" అనే సాంగ్ ని అద్భుతంగా పాడాడు. ఇక థమన్ అడిగిన ప్రశ్నకు వి.దయాసాగర్ అనే గురువు దగ్గర హిందుస్తానీ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాని చెప్పాడు నిహాల్. ఇక థమన్ కి ఈ సాంగ్ బాగా నచ్చినట్టుగా ఉంది ఈ సాంగ్ జావేద్ అలీ వాయిస్ లో ఆ తరువాత నిహాల్ వాయిస్ లోనే చాలా బాగుందని చెప్పుకొచ్చాడు. నీ వాయిస్, నీ డైనమిక్స్ అన్నీ చాలా బాగున్నాయి అన్నాడు. ఐతే సింగింగ్ అనేది అలాగే తెలుగు ఇండియన్ ఐడల్ అనేది తన తండ్రి కల అని ఆ ఆశను గెలిపించడానికి ఈ షోకి వచ్చినట్లు చెప్పాడు. "నార్మల్ గా తిరిగే మ్యూజికల్ టెర్రరిస్టులా ఉన్నావ్..ప్రశాంతంగా ఉన్నావ్..నాకు నోరు తెరిస్తే ఏవేవో వస్తున్నాయి. అంటే మ్యూజికల్లీ" అంటూ థమన్ టెర్రరిస్ట్ అని కితాబిచ్చేసరికి నిహాల్ కూడా సరదగా నవ్వేసాడు.

ఇక కార్తీక్ ఐతే వ్వావ్ అనేశాడు అలాగే పల్లవిని మళ్ళీ పాడించుకుని మెచ్చుకున్నాడు. ఇక గీత మాధురి ఐతే చాలా అమాయకంగా ఉన్నావ్, మంచి పర్ఫెక్షన్ తో డైనమిక్స్ తో సాంగ్ ని అర్ధం చేసుకుని అద్భుతంగా పాడావు అని చెప్పింది. ఇక ఈ షోకి సుందరకాండ మూవీ ప్రొమోషన్స్ కోసం వచ్చిన నారా రోహిత్, శ్రీదేవి కూడా మెచ్చుకున్నారు. ఇక థమన్, కార్తీక్ స్టేజి మీదకు వెళ్లి గోల్డెన్ టికెట్ ఇచ్చారు. కాసేపు నిహాల్ ని మాటల్లో పెట్టి ఆ గోల్డెన్ టికెట్ ని వెనక్కి తీసేసుకుని గోల్డెన్ మైక్ ఇచ్చారు. ఇక నిహాల్ ఆనందం మాములుగా లేదు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.