English | Telugu

తన్మయ్ ని పెళ్లి చేసుకుంటున్న రాకింగ్ రాకేష్..

రాకింగ్ రాకేష్ ఎంతో ప్రేమించి జోర్దార్ సుజాతను పెళ్లి చేసుకున్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఐతే ఇప్పుడు రాకేష్ తన్మయ్ మోజులో పడి సుజాతను వదిలేయాలని అనుకుంటున్నాడు. తన్మయ్ ని వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఐతే తన్మయ్ తో పెళ్లి కోసం సుజాతను నానా మాటలు అనేశాడు.. సుజాత ముఖం అరటి తొక్కాలా ఉందని, ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారని కామెంట్స్ చేసేసాడు. అసలు ఎవరు చేసుకుంటారండీ ఇలాంటి అమ్మాయిని.. ఎవరు సుజాతను పెళ్లి చేసుకుంటాడో వాడు చచ్చాడే అంటూ మౌనం కూడా పాటించాడు.

ఇక సుజాత ఆ రాకేష్ కామెంట్స్ కి ఫీలైపోయింది పాపం. ఏంటా ఫేస్..చూడు తన్మయ్ ఫేస్ ఎలా ఉందో..తన్మయ్ ని చూస్తే ఆమె అందానికి అందరూ కుళ్ళుకుని ఏడ్చి చస్తారు అన్నాడు రాకేష్. సుజాతను చూస్తే కుక్కలు కూడా వెంటపడవ్..అని మరీ ఎక్కువ కామెంట్స్ చేసేసరికి సుజాత ఇక ఊరుకోలేదు అందుకే రీసెంట్ గా ఒక కుక్క ఎమ్మట పడింది అని కౌంటర్ ఇచ్చింది. సుజాత ఎక్కువ మాట్లాడుతోంది అందుకే ఆమెను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కి తీసుకెళ్తే అక్కడ షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు..అది ఇచ్చిన వెంటనే మెంటల్ తగ్గిపోతుంది అని రాకేష్ ఉచిత సలహా ఇచ్చేసరికి సుజాత ఇక ఊరుకోలేదు మీరెన్ని సార్లు పెట్టించుకున్నారు అని గట్టిగా సీరియస్ గా అడిగేసింది దాంతో రాకేష్, తన్మయ్ ముఖాలు మాడిపోయాయ్. ఇక ఎందుకొచ్చిందిలే అనుకున్న రాకేష్ "నేను తన్మయ్ ని పెళ్లిచేసుకుంటున్నా మీ ఆశీర్వాదాలు కావాలి" అని సుజాతను అడిగేసరికి "తప్పకుండా నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి" అని చెప్పింది సుజాత ...అలాగే తన్మయ్ విష్ కూడా చేసేసింది. ఇక ఇదంతా నిజమేనేమో అనుకుంటున్నారా కాదు ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఈ వారం పెర్ఫార్మ్ చేసిన రాకేష్ స్కిట్.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.