English | Telugu

ముకుంద చేసిన పనులను చూసి ఆశ్చర్యపోయిన భవాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'కృష్ణ ముకుంద మురారి' ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సీరియల్ లో.. గతవారం జరిగిన ఎపిసోడ్ లో ముకుంద, కృష్ణకి నిజం చెప్తుందేమోననే ట్విస్ట్ క్రియేట్ చేసారు మేకర్స్. కాగా ఈ సీరియల్ ఎపిసోడ్ -82 లోకి అడుగుపెట్టింది. గురువారం నాటి ఎపిసోడ్ లో.. మురారి, కృష్ణలది నిజం పెళ్ళి కాదని.. అగ్రిమెంట్ పెళ్ళని ఆవేశంలో ముకుందకు చెప్తాడు మురారి. దీంతో సంతోషంతో మురారిని హత్తుకుంటుంది ముకుంద. మురారి మాత్రం ఆవేశంలో నోరు జారానని భయపడుతుంటాడు. ఇప్పుడు ముకుందని కంట్రోల్ చెయ్యడం చాలా కష్టమని మురారి టెన్షన్ పడతాడు.

ఆ తర్వాత కృష్ణ, మురారి కాళ్ళు పట్టుకొని లాగుతుంది. "ఏంటి కృష్ణా.. ఏం చేస్తున్నావ్" అని మురారి అడుగుతాడు. "నా కాటుక కన్పించట్లేదు సర్.. అసలే నేను అందంగా ఉంటానని కాటుక పెట్టుకుంటాను" అని కృష్ణ అంటుంది. అవునవును నువ్వు అందంగా ఉంటావని మురారి అనగా.. అవును సర్ రాత్రి మీరు ఎక్కడికెళ్ళారు? నేను లేచేసరికి మీరు లేరు. నాకు భయమేసి దుప్పటి కప్పుకొని పడుకున్నాని కృష్ణ అంటుంది. ముకుందతో మాట్లాడానని చెబితే ప్రాబ్లం అవుతుందని.. బయటకెళ్ళానని చెప్పేసి తప్పించుకుంటాడు.

మరుసటి రోజు ఎప్పుడు ఇంట్లో చిన్నపని కూడా చేయని ముకుంద అన్ని పనులు చేస్తుంది. కారణం కృష్ణ, మురారిలది అగ్రిమెంట్ పెళ్ళనే సంతోషం. ముకుంద ప్రొద్దున్నే లేచి.. ఇంటిపని, వంటపని చేసి అందరిని టిఫిన్ చెయ్యడానికి రమ్మంటుంది. ఏంటి ముకుంద వంట చేసిందా అని అందరూ ఆశ్చర్యపోతారు. "ఏంటి ముకుందా.. ఇంత సంతోషంగా ఉన్నావ్" అని భవాని అడుగుతుంది. నా సంతోషానికి కారణం మురారికి తెలుసని ముకుంద అంటుంది. అప్పుడు మురారి.. అవును ఆదర్శ్ ని వెతకడానికి ఇంకా ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నాను.. తొందర్లోనే ఆదర్శ్ ని తీసుకొస్తానని మురారి అనడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకు దక్కదనుకున్న సంతోషం.. మళ్ళీ మనకు దక్కినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది కదా అని ముకుంద అంటుంది. అది విన్న రేవతి.. "అవును.. ఆదర్శ్ వస్తే నువ్వు తను సంతోషంగా ఉండొచ్చు" అని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.