English | Telugu

ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటున్న గుప్పెడంత మనసు సాక్షి...

రసజ్ఞ రీతూ... ఈమె పెద్దగా ఎవరికీ తెలీదు కానీ గుప్పెడంత మనసు సీరియల్ లో రిషిని మొదటగా ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ తర్వాత తన స్టడీస్ కోసం ఫారెన్ వెళ్లిన రోల్ లో చేసిన సాక్షి అంటే ఎవరైనా గుర్తుపట్టేస్తారు. తర్వాత రిషికి , వసుధారకు మధ్య గొడవలు పెట్టడానికి ఫారెన్ నుంచి వచ్చి రిషిని ఏడిపించిన ఈ రోల్ ని చూసి ఆడియన్స్ తెగ తిట్టుకున్నారు. అలా కొంత కాలం పాటు ఈ సీరియల్ లో అలరించింది. కానీ వసుధారా రోల్ డామినేట్ చేసేసరికి రసజ్ఞ రీతూ రోల్ తేలిపోయింది. దాంతో ఆమె క్యారెక్టర్ ఆడియన్స్ కి కూడా పెద్దగా గుర్తులేదనే చెప్పొచ్చు. అలాంటి రసజ్ఞ ప్రస్తుతం మౌన పోరాటం సీరియల్ లో నటిస్తోంది..

అలాగే జీ తెలుగులో రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సీరియల్ లో కూడా నటిస్తోంది. ఈ సీరియల్స్ నుంచి కూడా తప్పుకోబోతోంది. రసజ్ఞ తన ఫ్యూచర్ కెరీర్ కోసం తన యాక్టింగ్ కెరీర్ ని క్విట్ చేయబోతున్నట్లుగా ఒక వీడియో చేసి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. అందులో మౌన పోరాటం సీరియల్ నటీమణులతో కలిసి చాలా ఎమోషనల్ అయ్యింది. తనకు అసలు ఈ ఇండస్ట్రీని వదిలి వెళ్లాలని లేదు అని చెప్పి ఏడ్చేసింది. ఇప్పటికీ సీరియల్ లో నటించిన తన తోలి రోజు గుర్తుంది అని అలాగే తినీ తినకుండా ఎంతో కష్టపడి షూట్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయని గుర్తుచేసుకుంది. ఇలా కెరీర్ ని, ఇండస్ట్రీని ఇలా వదిలి వెళ్లిపోయే రోజు ఒకటి వస్తుందని అస్సలు ఊహించలేదని కన్నీళ్లు పెట్టుకుంది. నిద్రపోయినా కూడా లైట్, యాక్షన్, కెమెరా అనే మాటలే వినిపించేవి ఇక రేపటి నుంచి ఆ మాటలు వినిపించవు అని తెలిస్తేనే చాలా బాధగా ఉందని చెప్పింది. షూటింగ్ అంటే తనకు అంత ప్యాషన్ అని చెప్పింది. ఇక రేపటి నుంచి నటించడమనేది ఉండదని తెలిస్తేనే ఏదోలా ఉంది. కానీ బెటర్ ఫ్యూచర్ కోసం తప్పట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఐతే రసజ్ఞకి మంచి రోల్స్ వస్తున్నా అనుకున్నంత బ్రేక్ ఐతే రాలేదు. నార్మల్ గా కెరీర్ నడుస్తోంది. మరి బెటర్ ఫ్యూచర్ కోసం అంటే మళ్ళీ చదువుకోవడానికా లేదంటే బెటర్ జాబ్ వచ్చిందా అనే విషయాలేవీ రివీల్ చేయలేదు రసజ్ఞ. షూటింగ్ లో తన ఫైనల్ డే రోజున తన యూనిట్ లోని అందరికీ గిఫ్ట్ పాకెట్స్ ఇచ్చింది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.