English | Telugu

రాజ్ కావ్యల శోభనం జరిగిందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -56 లో... రాజ్ కావ్యల శోభనం చెడగొట్టాలని రాహుల్ భావించి.. రాజ్ దగ్గరికి వెళ్ళి కావ్యపై అన్నీ కల్పించి చెప్తాడు. నీ వెనకాల ఉన్న ఆస్తి కోసమే ఆ కావ్య అలా చేసింది. అసలు తప్పంతా నీదే రాజ్ ఎంత ఈజీగా మోసపోయావని రాహుల్ అనగానే.. అవును నన్ను ఫూల్ ని చేసి పెళ్లి చేసుకుంది.. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని అంటూనే పెళ్లి చేసుకుందని రాజ్ అంటాడు. మరి ఎందుకు నువ్వు ఇదంతా భరించాలి... తప్పు చేసిన వాళ్ళ మీద కదా నీ కోపాన్ని చూపాలని రాజ్ కి మందు తాగమని రాహుల్ ఇస్తాడు. ఇప్పుడు ఒకసారి జరిగిందంతా ఆలోచిస్తే అసలు స్వప్న వెళ్ళలేదు.. కావ్యనే వెళ్ళిపోయేలా చేసి పెళ్లి పీటలపై కూర్చొని ఉన్నట్టుంది.. డబ్బు కోసం ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమైనా చేస్తారని రాహుల్ అంటాడు. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇదంతా కావాలనే ఆ కావ్య చేసింది దానికి బుద్ది చెప్తానంటూ రాజ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నీ శోభనం జరగకుండా ఇదంతా నా ప్లాన్ రాజ్ అని రాహుల్ తన మనసులో అనుకుంటాడు.

రాజ్ ఫుల్ గా తాగి కావ్య ఉన్న స్టోర్ రూమ్ కు వెళ్తుంటే కళ్యాణ్ ఆపి.. అన్నయ్య ఏం నువ్వు చేస్తున్నావ్? తాగావా? అని అడుగుతాడు. నేను ఇప్పుడు ఆ కళావతికి బుద్ది చెప్పాలి.. అయినా నా భార్య దగ్గరికి నేను వెళ్తుంటే.. ఆపే హక్కు నీకు ఎక్కడిదిరా అని చెప్పేసి.. కావ్య ఉన్న స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్తాడు. స్టోర్ రూంకి బయటవైపు గడియపెట్టి ఉండడంతో లోపల దాక్కోని బయట గడియా పెట్టించవా అని గడియ తీసి లోపలికి వెళ్ళిపోతాడు. ఏంటి ఇక్కడికి వచ్చారు? వెళ్లిపోండని కావ్య అంటుంది. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావ్? నీకు బుద్ది చెప్పాకే వెళ్తాను.. అయినా ఇది నా ఇల్లు.. నన్ను వెళ్ళమంటావా అని రాజ్ అంటాడు. ఏదైనా ఉంటే ఉదయం మాట్లాడదామని కావ్య చెప్పినా కూడా వినకుండా తాగిన మైకంలో కావ్యపై పడిపోతాడు. అప్పుడు కావ్య రాజ్ ని బెడ్ పై పడుకోబెట్టబోతుండగా.. కావ్య నుదిటి మీద ఉన్న కుంకుమ రాజ్ షర్ట్ కి అంటుకుంటుంది. ఎంత వద్దనుకున్నా మనం దగ్గర అవుతున్నామా.. నాకు ఎందుకో నచ్చడం లేదని కావ్య అనుకుంటుంది. నువ్వు ఎంత అందంగా ఉంటే మాత్రం.. నిన్ను అస్సలు క్షమించనని కావ్యని తల్చుకుంటూ నిద్రపోతాడు.

ఆ తర్వాత ఉదయం అందరు హాల్లో కూర్చొని ఉంటారు. కావ్య రూమ్ లో నుండి రాజ్ చెప్పులు చేతిలో పట్టుకొని వస్తుంటే.. అందరూ షాక్ అవుతారు. రాత్రి శోభనం ఇష్టం లేదు అన్నట్లు మాట్లాడి ఇప్పుడు కావ్య రూమ్ లో నుండి బయటకు వస్తున్నావని రాజ్ నానమ్మ అంటుంది. ఏంటి వీళ్ళు శోభనం జరిగిందని అనుకుంటున్నరా అని రాజ్ తన మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.