English | Telugu

కూతురిని చూసెళ్దామని వచ్చిన కనకం.. అడ్డుగోడగా రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -46 లో.. కావ్యని చూడాలన్న ఆశతో రాజ్ ఇంటికి వస్తుంది కనకం. అయితే అందరు అక్కడే ఉండడంతో కనకంని చూస్తారు. తల్లిని చూసిన ఆనందంలో కావ్య పరుగెత్తుకుంటూ కనకం దగ్గరికి వచ్చి తనని హత్తుకోవాలనుకుంటుంది. ఇంతలో రాజ్ ఆగండి అని చెప్తాడు. కావ్య, కనకం ఇద్దరు ఆగిపోతారు. కావ్యని చూసిన కనకం ఏడుస్తూ ఎలా ఉన్నావ్ అని అడిగేలోపే.. రాజ్ కోపంగా ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? అని అంటాడు. నా కూతురు దగ్గరికి వచ్చాను అని కనకం అనగానే.. ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడే ఎవరితో సంబంధం లేకుండా పోయిందని రాజ్ అంటాడు. దాంతో "అమ్మ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్" అని కనకం కావ్యని అడుగుతుంది.

రాజ్ కోపాన్ని భరిస్తూ కనకం అక్కడే ఉంటుంది. పేద కుటుంబం అయినా కూడా మాకు నిజం చెప్తే మేం ఒప్పుకునేవాళ్ళం.. ఇలా ఇంత మోసం చేశారని అపర్ణ అంటుంది. "ప్రతి తల్లితండ్రులు తమ కూతుళ్ళను గొప్పింటికి కోడళ్ళు చెయ్యాలనుకుంటారు.. అది తప్పు కాదు. మీ గురించి మా అయనకి చెప్పి మా కూతురిని మీ ఇంటి కోడలు చేసుకోండని ఒక మాట చెప్తే ఒప్పుకునే వారు.. ఇలా మోసం చేసి పెళ్ళి చెయ్యడం కరెక్ట్ కాదు" అని రాజ్ వాళ్ళ నానమ్మ అంటుంది. నేను తప్పు చేశానంటూ కనకం అందరి కాళ్ళు పట్టుకోబోతుంటే కావ్య వద్దు అంటుంది. నువ్వు ఎందుకు బ్రతిమిలాడుతున్నావ్ అమ్మ.. ఆడపిల్ల తల్లివి అయినందుకా? నువ్వు మా కోసం ఎన్నో చేసావ్. నువ్వు అలా బ్రతిమిలాడకు అని కావ్య కనకంని అంటుంది.

ఆ తర్వాత మీరు ఇంత మోసం చేస్తారా? మీ మీద పోలీస్ కంప్లెంట్ ఇస్తానని రాజ్ ఫోన్ చేయబోతుండగా.. వద్దని ఇంట్లో అందరు అంటారు. కావ్య మాత్రం చెయ్యండి తప్పు ఎవరిదో తెలుస్తుందని అనేసరికి.. కావ్యను కోపంగా చూస్తాడు రాజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.