English | Telugu
అదిరిందయ్యా సిప్లి.. కొత్త ఇల్లు.. కొత్త కారు!
Updated : Aug 24, 2022
బిగ్ బాస్ కి ముందు వరకు రాహుల్ సిప్లిగంజ్ అంటే చాలా కొద్ది మందికే తెలుసు. ఇక హౌస్ కి వెళ్లి టైటిల్ గెలిచి బయటికి వచ్చాక ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా నిలిచాడు. బిగ్ బాస్ కంటే ముందు ప్లే బ్యాక్ సింగర్ గా ప్రైవేట్ ఆల్బమ్స్ చేసేవాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ గురించి ఇప్పుడైతే తెలియని వారంటూ ఎవరూ లేరు. అతను ఏ పాట పాడినా మంచి ఫీల్ తో పాడతాడు. అందుకే ఆడియన్స్ కి కూడా రాహుల్ అంటే చాలా ఇష్టం. ఇటీవలే కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేసేసాడు రాహుల్ సిప్లిగంజ్. తన పుట్టినరోజు కూడా జరుపుకున్నాడు. ఈ సందర్భంగా 65 లక్షల విలువైన కార్ కూడా కొనుక్కున్నాడు.
"నా తల్లిదండ్రులకు , నా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు ! ప్రత్యేకంగా నా సోదరుడికి కృతఙ్ఞతలు ..నన్ను ఇష్టపడే వాళ్ళందరి నుంచి నా పుట్టినరోజు నాడు ఇలాంటి అద్భుతమైన గిఫ్ట్ అందుకున్నాను" అంటూ రాహుల్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. అలీ రెజా, అరియనా గ్లోరీ కూడా విషెస్ పోస్ట్ చేశారు. బిగ్ బాస్ హౌస్ లో సొంతింటి కల గురించి చెప్పి బయటికి వచ్చాక దాన్ని నెరవేర్చుకున్నారు రాహుల్. ఇలా అన్ని శుభవార్తలు తెలిసేసరికి ఇండస్ట్రీకి చెందిన అభిమానులు, స్నేహితుల నుండి రాహుల్‌కు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇక తాను కొన్న కార్ ఫొటోస్, కొత్త ఇంటి చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.