English | Telugu

బ్రేకింగ్ న్యూస్ హెడ్ లైన్స్ లో సుధీర్, ఇమ్ము

జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానుయేల్ గురించి అందరికీ తెలుసు. ఇమ్ము, వర్ష లవ్ ట్రాక్ కి పునాది కూడా ఈ జబర్దస్త్ లోనే పడింది. సుధీర్, రష్మీ లవ్ ట్రాక్ తర్వాత వర్ష, ఇమ్ము లవ్ ట్రాక్ మస్త్ ఫేమస్ అయ్యింది. ఐతే ప్రస్తుతం ఇమ్ము పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నామంటూ ప్రభుత్వం ఒక బ్రేకింగ్ న్యూస్ ప్రకటించేసరికి షాక్ అయ్యాడు. దీనికి కారణం ఏంటంటే "నైజీరియా, వెస్ట్ ఇండీస్, కెన్యా దేశాలు ఇమ్ము కోసం పోట్లాడుకుంటున్నాయట. మా వాడంటే మా వాడు అంటూ కొట్టుకు ఛస్తున్నాయట". ఈ డైలాగ్ కి ఇమ్ము నవ్వాలో ఏడవాలో అర్ధం కాక సైలెంట్ గా ఉన్నాడు. అలాగే సుధీర్ గురించి కూడా సోషల్ మీడియాలో ఒక బ్రేకింగ్ న్యూస్ ట్రోల్ అవుతోంది. "పందుల పెంపకం వీడియోలో కూడా..వి వాంట్ సుధీర్, వి వాంట్ సుధీర్ " అంటూ కామెంట్స్ పెడుతున్నారట నెటిజన్స్. ఇలా స్పెషల్ బ్రేకింగ్ న్యూస్ బులెటిన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ వారం ఇలా సుధీర్, ఇమ్ము వార్తలకెక్కారు. ఈటీవీ 27వ వార్షికోత్సవం సందర్భంగా ఒక స్పెషల్ ఈవెంట్ చేసింది. ఆ ఈవెంట్ పేరు "భలే మంచి రోజు"..ఈ డైలాగ్స్ ఆ ఎపిసోడ్ లోవి. ఇక ఈ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఈవెంట్ లో ఈటీవీలో రెగ్యులర్ గా న్యూస్ బులెటిన్స్ వచ్చే న్యూస్ రీడర్స్ తో ఈ బ్రేకింగ్ న్యూస్ చదివించారు. మల్లెమాల నుంచి వెళ్లిపోయిన వాళ్లంతా ఈ షోకి వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేసినట్లు కనిపిస్తోంది. వాళ్ళు ఎంత ఎంటర్టైన్ చేశారు అనే విషయం తెలియాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ వార్షికోత్సవ స్పెషల్ ఎపిసోడ్ 28 వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలు ప్రసారం కాబోతోంది.