English | Telugu

ఇట్స్ నాట్ బోల్డ్.. గుర్తుపెట్టుకోండి నేనొక యాక్టర్!

ప్రియాంక సింగ్ ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో ఉన్న సెలబ్రిటీ. జబర్దస్త్ ద్వారా బుల్లితెరకు సాయితేజ గా పరిచయం అయ్యాడు. అయితే జబర్దస్త్ షోలో లేడీ గెటప్స్ ఎక్కువగా వేసిన సాయితేజ.. కొన్ని రోజులకి ఆపరేషన్ చేయించుకొని.. తనని తాను ట్రాన్స్ జెండర్ గా మార్చుకొని కొత్తగా మారిపోయాడు. ఇప్పుడు ప్రియాంక సింగ్ గా అవతారమెత్తాడు సాయితేజ. ట్రాన్స్ జెండర్ గా మారిన తర్వాత తను పడిన కష్టాలను, ఎదుర్కున్న ఇబ్బందులు అన్నింటిని చాలా సార్లు చెప్పుకొచ్చింది ప్రియాంక సింగ్. తను ప్రియాంక సింగ్ గా మారిన తర్వాత బిగ్ బాస్ లో అవకాశం లభించింది.

ప్రియాంక సింగ్.. బిగ్ బాస్ లోకి వెళ్ళాక తన ప్రవర్తన, మాటతీరు, ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రియాంక సింగ్ హౌస్ లో తన తోటి కంటెస్టెంట్ మానస్ తో ఎక్కువ సన్నిహితంగా ఉండడం.. అతని కోసం తన గేమ్ మార్చుకోవడంతో.. హోస్ట్ నాగార్జున రెండు మూడు సార్లు గేమ్ చేంజ్ చేసుకోవాలని ప్రియాంక ని మందలించాడు. అయితే తన ఆటతీరును ఏ మాత్రం మార్చుకోకపోయేసరికి బిగ్ బాస్ నుండి బయటకొచ్చేసింది ప్రియాంక. హౌస్ నుండి బయటకొచ్చాక తనకు అభిమానులు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.

బిగ్ బాస్ తర్వాత ప్రియాంక సింగ్.. ఒక్కసారిగా సెలబ్రిటీ లిస్ట్ లోకి చేరింది. ఇప్పుడు వరుస ఆఫర్స్ తో బిజీ గా ఉంటుంది. ప్రియాంక మంచి హ్యూమన్ బీయింగ్.. ఇప్పటి వరకు బిగ్ బాస్ లోకి ట్రాన్స్ జెండర్ కేటగిరిలో.. మొదటగా తమన్నా సింహాద్రి వెళ్ళగా, రెండవ వ్యక్తిగా ప్రియాంక సింగ్ వెళ్లింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు చీరకట్టుతో ఆకట్టుకున్న ప్రియాంక.. ఇప్పుడు తన రూట్ మార్చినట్టుంది. తన అందాలను చూపిస్తూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ లు చేస్తుంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో తన అందాన్ని బయటకు చూపిస్తూ ఉన్న ఫోటోలని షేర్ చేసింది ప్రియాంక. ఆ ఫోటోలని చూసిన తన అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటివరకు చీరకట్టులో ఎంతో బాగున్న మీరు.. ఇప్పుడు ఇలా చేయడం ఏం బాలేదంటూ ఆమె పోస్ట్ కింద కామెంట్లు చేస్తున్నారు. నెట్టింట వైరల్ గా మారిన ప్రియాంక సింగ్ హాట్ ఫోటోస్ పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. అయితే ఈ హాట్ ఫోటోస్ కి .. "It's not bold.. remember that I am an Actor ' అంటూ క్యాప్షన్ పెట్టి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ప్రియాంక.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.