English | Telugu

వామ్మో దీపికతో ముచ్చట్లు మామూలుగా ఉండవు!

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో టాప్-5 లో నిలిచిన ప్రియాంక జైన్ అందరికి తెలుసు. తను శివకుమార్ ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. అయితే వీరిద్దరు కలిసి యూట్యూబ్ లో నెవెర్ ఎండింగ్ టేల్స్ అనే యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ యూట్యూబ్ ఛానెల్ ఏడు లక్షల సబ్ స్క్రైబర్స్ ని కలిగి ఉంది. అయితే తాజాగా వీరిద్దరు కలిసి ఓ వ్లాగ్ చేశారు. అదేంటో చూసేద్దాం.

వామ్మో దీపికతో ముచ్చట్లు మాములుగా ఉండవు అనే వ్లాగ్ ని తమ యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేశారు. ఇందులో బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ కావ్య అలియాస్ దీపిక గంగరాజు వచ్చేసింది. ఓ ఈవెంట్ లో అమర్ దీప్, దీపిక, అందరు కలిసినట్టుగా ఈ వ్లాగ్ లో చెప్పింది ప్రియాంక. ఇక దీపికతో కాసేపు సరదాగా మాట్లాడింది. ఇంటికి రమ్మని.. ఆతిధ్యం తీసుకోవాలని దీపికని ప్రియాంక రిక్వెస్ట్ చేయగా.. నెక్స్ట్ టైమ్ తప్పకుండా వస్తానని దీపిక అంది. ఇక ఆ తర్వాత ప్రియాంక, శివకుమార్ కలిసి గౌతమ్ కృష్ణ పుట్టిన రోజు వేడుకలు జరిగే ప్లేస్ కు వెళ్ళారు‌ . అక్కడ శివ్, ప్రియాంక కలసి గౌతమ్ కి విషెస్ చెప్పి మాట్లాడుకున్నారు. ఇక గౌతమ్ సినిమా సక్సెస్ కావాలని ఇద్దరు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

తాజాగా ప్రియాంక జైన్ కి ఇన్ స్టాగ్రామ్ ఐడీకి 700k ఫాలోవర్స్ వచ్చారని చెప్పి సెలెబ్రేషన్స్ చేసుకోవడం కోసం తిరుపతి వెళ్లారు. అయితే ఈ మధ్యకాలంలో ప్రియాంక హాట్ అండ్ బోల్డ్ ఫోటోషూట్ లను చేస్తూ నెటిజన్ల మనసుని దోచేస్తుంది. మరోవైపు యూట్యూబ్ లో కూడా వైరల్ అవ్వాలని కొత్త కంటెంట్ లు చేస్తూ బిజీ లైఫ్ ని గడుపుతుంది. మరి బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పొట్టిపిల్లగా గట్టిపిల్లగా నిలిచిన ఈ భామ వ్లాగ్స్, రీల్స్ మీరు చూశారా కామెంట్ చేయండి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.