English | Telugu

మురారి ప్రేమ కోసం ముకుంద తపన!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -130 లో.. మురారికి ముకుంద మెసేజ్ చేసి రమ్మంటుంది. ఏంటీ ఈ టైంకి మెసేజ్ చేసి మాట్లాడాలి అంటుందని మురారి అనుకొని ముకుంద దగ్గరికి వెళ్తాడు. మురారి వెళ్ళేసరికి ముకుంద అందంగా ముస్తాబై ఉంటుంది. ఏంటి నందు పెళ్లి కోసం తీసుకున్న చీరని నువ్వు కట్టుకున్నావని మురారి అడుగుతాడు. నీకు చూపించాలని ఇలా కట్టుకొని రెడీ అయ్యానని ముకుంద అంటుంది. అలా అనగానే గదిలో నుండి బయటకు వస్తాడు మురారి. ఏంటి మురారి అలా వెళ్ళిపోతున్నావ్ అని ముకుంద అడుగుతుంది. నేను ఈ టైంలో నీ గదికి రావడమే తప్పని మురారి అంటాడు. నిన్ను ఈ టైంలో పిలవడం తప్పని కూడా తెలుసు కానీ నీ ప్రేమ కావాలని ముకుంద అంటుంది. నీపై నాకెప్పుడు సానుభూతి ఉంటుందని మురారి అనగానే.. "నాపై ఉండాల్సింది సానుభూతి కాదు ప్రేమ. నేను నిన్ను ఎప్పుడు కామంతో తాకాలనుకోలేదు. నాకు నీకు మధ్యలో ప్రేమ ఉండాలనుకున్నాను. నేను రోజు రోజుకు నీ దృష్టిలో దిగజారిపోతున్నాను. మన ప్రేమకి అడ్డుగా కృష్ణ ఉంది. నీ రూపం నా మనసులో నుండి పోయినప్పుడు.. ఈ ముకుంద నీకు కనిపించదు" అంటూ లోపలికి వెళ్ళి డోర్ వేసుకొని ఏడుస్తుంది ముకుంద. ఆ తర్వాత మురారి తన గదిలోకి వెళ్ళిపోతాడు.

మురారి తన గదిలోకి వెళ్ళి ఆలోచిస్తుంటాడు. ఒకవైపు గౌతమ్ పెళ్ళి.. మరోవైపు నందు పెళ్ళి.‌. రెండు ఒకే రోజు ఎలా మేనేజ్ చెయ్యాలని మురారి ఆలోచిస్తుండగా తన పక్కనే కృష్ణ నిద్రపోతుంటుంది. నిద్రలో ఏసీపీ సర్.. మీరు గౌతమ్ సర్ పెళ్లి చేస్తానని చెప్పి ఆ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ తెలిసి, ఇప్పుడు చెయ్యనని అంటున్నారా అని, అలాగే కాసేపు నిద్రలోనే మాట్లాడి పడుకుంటుంది. ఏంటి నేను ఏం చెప్పకుండానే కృష్ణ ఇలా చేస్తుందంటే.. చెప్తే ఇంకెలా ఉంటుందోనని మురారి అనుకుంటాడు. ఇక ఉదయం లేవగానే కృష్ణ ఎప్పటిలాగే గుడ్ మార్నింగ్ అని చెప్పి.. సారీ సర్ నాకు కల వచ్చింది.. మీరు మాట తప్పినట్లు నేను డ్రీంలో మీ కాలర్ పట్టుకున్న అని కృష్ణ చెప్తుంది. నువ్వు ఏం టెన్షన్ పడకు, గౌతమ్ పెళ్ళి నేను చేస్తానని మురారి అంటాడు.

మరోవైపు ముకుందని భవాని పిలిచి‌.. పెళ్లి పనులు ఎక్కడ వరకు వచ్చాయని అడుగుతుంది. అవుతున్నాయి అత్తయ్య.. కృష్ణకి తెలియకుండా, ఎవరికి తెలియకుండా చేస్తున్నాం కదా.. అందుకే మీకు పనుల గురించి తెలియట్లేదని ముకుంద అంటుంది. ఇంతలోనే కృష్ణ, మురారిలు వాళ్ళ రూం నుండి వస్తారు. అలా వస్తుండగా.. కృష్ణ కాలు స్లిప్ అయి పడిపోతుంటే.. మురారి తనని పట్టుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.