English | Telugu

పాటకు అర్ధం తెలిస్తే పిచ్చోళ్ళలా గంతులేయరు!

1991 లో రిలీజ్ అయిన "గుణ" మూవీ చూడని వాళ్ళు కానీ "కమ్మని ఈ ప్రేమ లేఖనే" అనే పాటను వినని వాళ్ళు ఎవరూ ఉండరు. ఆ పాట ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన "మంజుమల్ బాయ్స్" సినిమా మొత్తం కూడా ఈ గుణ కేవ్స్ లో తీయడంతో పాటు ఈ పాటను కూడా పెట్టారు. ఈ పాట నేపథ్యంలో కమలహాసన్ తన ప్రేమను పాట రూపంలో కాకుండా మాట రూపంలో చెప్తాడు.. అది కాస్త హీరోయిన్ పాటగా మార్చి పాడుతుంది. మానసికంగా దెబ్బ తిన్న హీరోగా కమల్ హాసన్ బాగా నటించాడు. అలాగే హీరోయిన్ ని విలన్స్ ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు వీళ్ళిద్దరూ బయటపడి ఈ గుణ కేవ్స్ కి వస్తారు. మొదట్లో హీరోని ద్వేషించే అమ్మాయి కాస్తా అతని మనసు మంచిదని తెలుసుకుని అతన్ని ఇష్టపడి మామూలు మనిషిని చేసి పెళ్లి చేసుకుంటుంది. ఐతే ఈ సాంగ్ వీళ్ళ మధ్య ప్రేమను పుట్టిస్తుంది, బాధను మరిపిస్తుంది...అలాగే వాళ్ళ జీవితాల్లో జరిగిన నిజాలని గుర్తించేలా చేస్తూ ఒకరిని ఒకరు ఓదార్చుకునే సాంత్వన గీతం..కానీ ఈ పాటను రీమిక్స్ చేసి చాలా మంది రకరకాల డాన్స్ స్టైల్స్ తో రీల్స్ చేసి ట్రెండ్ అవడం మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.

ఇప్పుడు ఆట సందీప్, జ్యోతి జోడి కూడా అలాగే ఈ రీమిక్స్ సాంగ్ కి కొత్త డాన్స్ స్టైల్ పెర్ఫార్మ్ చేసి ఆ వీడియోని పోస్ట్ చేశారు. అది చూసిన ఒక నెటిజన్ ఘాటుగా కామెంట్ పెట్టారు. "సాంగ్ మీనింగ్ తెలిస్తే ఇలా పిచ్చోళ్ళలా గంతులు వేయరు...రైట్ క్రేజ్ బట్ రాంగ్ సాంగ్" అంటూ ఒపీనియన్ ని ఇక్కడ పోస్ట్ చేసాడు. ఎందుకంటే ఒకప్పటి క్లాసిక్స్ కి లేదా కొన్ని ఓల్డ్ సాంగ్స్ ని ఇప్పటి జెనెరేషన్ అస్సలు టచ్ చేయకుండా ఉండడమే బెటర్ ..ఎందుకంటే ఆ పాటలు, ఆ సినిమాలు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అనేది అప్పటి వాళ్లలో అలాగే ఉండిపోయింది. వాటిని రిక్రియేట్ చేస్తే దాని సెన్స్ మొత్తం పాడైపోయి..ఎందుకు పనికి రాని సాంగ్స్ గా, మూవీస్ గా నిలిచిపోయే పరిస్థితి వస్తుంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.