English | Telugu

అఖిల్ సార్థక్ ని ముద్దు పెట్టుకున్న ముమైత్ ఖాన్!

అఖిల్ సార్థక్.. బిగ్ బాస్ ముందు వరకు ఎవరికి తెలియదనే చెప్పాలి. బిగ్ బాస్ 4 ఎంట్రీతోనే ప్రేక్షకులకు దగ్గరై ఫేమ్ సంపాదించుకున్నడు. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు.. 'నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో' అని అన్నట్లుగా ఉండేవాడు అఖిల్. అతని బిహేవియర్ చాలా మందికి నచ్చేది కాదు. అంతేకాకుండా హౌస్ లో మోనాల్ గజ్జర్ గురించి అఖిల్, అభిజిత్ ల పంచాయతీ వీధుల్లో కుళాయిల దగ్గర ఉండే కొట్లాటలాగా ఉండేది. అఖిల్ బిగ్ బాస్-4 రన్నర్ గా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా బిగ్ బాస్ ఓటీటీలో కూడా మరోసారి ఎంట్రీ ఇచ్చి.. అందులో కూడా రన్నరప్ గానే నిలిచాడు.

అయితే తాజాగా అఖిల్ మంచి పాపులారిటీ సంపాదించుకొని.. ఈవెంట్స్, షోస్ తో బిజీ గా ఉంటున్నాడు. అంతేకాకుండా బిబి జోడిలో తేజస్వినితో జతకట్టి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బిబి జోడి షోలో హాట్ పెర్ఫార్మన్స్ ఎవరంటే అఖిల్-తేజస్వినిల పేరే వినిపిస్తుందని అనడంలో ఆశ్చర్యమే లేదు. బిబి జోడీలో సైతం కౌశల్ తో.. నువ్వా నేనా అంటూ మాటల యుద్ధమే జరిగిందని చెప్పాలి. అయితే కొన్ని కారణాల వల్ల అఖిల్ జోడీ ఫైనల్ వరకు వెళ్ళలేదు. అఖిల్ కి కండరాల నొప్పి వల్ల తన కాలికి శస్త్రచికిత్స కూడా జరిగింది. దీంతో డాక్టర్లు కొన్నిరోజులు అఖిల్ ని డ్యాన్స్ చేయవద్దని చెప్పారంట.‌. అందుకనే బిబి జోడీ షో నుండి అఖిల్ తప్పుకున్నాడు.

అఖిల్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేశాడు. తనకి ముమైత్ ఖాన్ ముద్దు పెట్టిన ఫోటోని షేర్ చేశాడు. బిగ్ బాస్ ఓటీటీలో ప్రసారమైన షోలో వీళ్ళిద్దరు కలిసి ఉండేవారు. వీళ్ళిద్ధరు కలిసి నామినేషన్ల ప్రక్రియలో ఎలా ఉండాలి.. ఎవరికి నామినేషన్ వేయాలంటు ఎప్పుడు కబుర్లు చెప్పుకునేవాళ్ళు.. అయితే బిగ్ బాస్ నుండి మోమైత్ ఖాన్ బయటకు వస్తున్నప్పుడు నాగార్జునతో‌ స్టేజ్ మీద ఉండగా.. తన కోసం నీ స్నేహం అంటూ పాటని కూడా పాడాడు అఖిల్. వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారు. అలాంటిది వాళ్ళిద్దరు ఏదో ఫంక్షన్ లో కలిసినట్టున్నారు. దాంతో అఖిల్ కి ముద్దుపెట్టినట్టుంది మోమైత్ ఖాన్. అయితే ఈ ఫోటో‌ని మొమైత్ ఖాన్ కూడా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. కాగా ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.