English | Telugu

శ్రద్దాను లవ్ చేస్తున్నట్లు చెప్పిన లిఖిత్..మందు గ్లాసుతో పండు

ఢీ 15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్ షో ప్రతీ వారం ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఈ వారం ఉగాది పండగ రోజు ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇందులో లిఖిత్ అనే కుర్రాడు "జలజలపాతం నువ్వు" సాంగ్ కి బాగా డాన్స్ చేసాడు. దానికి శేఖర్ మాస్టర్ ఫిదా ఐపోయి "లిఖిత ఎప్పుడైనా ఎవరినైనా లవ్ చేసావా" అని అడిగేసరికి "శ్రద్దా మేడంని లవ్ చేశా అని చెప్పాడు". నేను సముద్రాన్ని చూద్దామనుకుంటే మీరు సునామీనే చూపించారు" అని చెప్పింది శ్రద్దా. "టీం బి వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి టీం ఏ వాళ్ళు బాగా చేయాలనీ కోరుకుంటున్నా" అని పండు అనేసరికి "శోభితా ఏమిటిది..ఏ టీం వాళ్ళను అంటున్నాడు" అని శేఖర్ మాస్టర్ అనడంతో శోభిత ఫుల్ సీరియస్ లుక్ ఇచ్చింది పండు వైపు.

పండు ఆమె లుక్ కి భయపడి "శోభిత అక్కడ లేదు ఇక్కడ ఉంది" అంటూ తాను వేసుకున్న టీ షర్ట్ వెనక ఉన్న ఒక జపాన్ అమ్మాయి బొమ్మ చూపించి ఫన్ క్రియేట్ చేసాడు. ఇక వీకెండ్ టైటిల్ విన్నర్ డాన్స్ మాస్టర్ రాజు వచ్చి డాన్స్ ఇరగదీసాడు. ఈ ఉగాది సందర్భంగా మన ఢీ షో తరపున ఒక కొరియోగ్రాఫర్ కొత్త పోస్టర్ రిలీజ్ చేద్దామనుకుంటున్న అని చెప్పాడు ప్రదీప్. తరువాత పోస్టర్ ప్లీజ్ అని పండు ఫోటోని స్క్రీన్ మీద వేయించాడు. "పండు ఇంత గొప్పదా" అనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటే పండు ఆ పోస్టర్ ని వేయొద్దని అరిచాడు. ఇప్పుడు ఫస్ట్ లుక్ చూసాం సెకండ్ లుక్ చూద్దాం అనేసరికి ఇంకో పోస్టర్ వచ్చింది. అందులో మందు గ్లాస్ పట్టుకుని కూర్చున్న పోజ్ కనిపించింది. "పర్లేదు వీడియోనే చూపించండి నాకేమన్నా భయమనుకున్నారా" అని పండు ఆ పోస్టర్స్ చూసి రేచిపోయేసరికి టీజర్ చూపించాడు ప్రదీప్. దాంతో అందరూ నవ్వేశారు . ఫైనల్ గా ఉప్పెన మూవీలో "జలజల" సాంగ్ కి శ్రద్దా దాస్ , శేఖర్ మాస్టర్ మంచి రొమాంటిక్ స్టెప్స్ తో డాన్స్ చేశారు. వాళ్ళను అలా చూసిన హైపర్ ఆది నెత్తి మీద తెల్ల క్లాత్ కప్పుకుని అంతా ఐపోయింది అన్న లెక్కలో బాధపడుతూ కూర్చున్నాడు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.