English | Telugu

మురారి పిలిస్తే ముకుంద ఎలా వచ్చిందని డౌట్ పడిన కృష్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎపిసోడ్ -67 లోకి అడుగుపెట్టింది. కాగా సోమవారం జరిగిన ఎపిసోడ్ లో.. ముకుందని మురారి తీసుకురావడంతో ఇంట్లో వాళ్ళు సంతోషపడుతారు. మురారికి చెరొక వైపు కృష్ణ, ముకుందలు ఉండగా.. ముగ్గురు కలిసి ఒకేసారి ఇంట్లోకి వస్తారు.

ముకుంద రాకతో మళ్ళీ ఎలాంటి గొడవలు జరుగుతాయో అన్న టెన్షన్ లో రేవతి కళ్లుతిరిగి కింద పడిపోతుంది. ఇంట్లో వాళ్ళు లేపి.. ఏం అయిందని అడిగితే "నీరసంగా ఉంది" అని రేవతి చెప్తుంది.

"ముకుంద.. ఇది నీ ఇల్లు. నీకు నచ్చినట్లు ఉండు.. నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టరు" అని భవాని అంటుంది. ఇంతలో అమాయకురాలు కృష్ణ "థాంక్యూ ACP సర్.. నా కోసం ముకుందని తీసుకొచ్చారు" అని షేక్ హ్యాండ్ ఇస్తుంది. కృష్ణ ఇలా మాట్లాడిన మాటలు విన్న ముకుంద "ఏంటీ కృష్ణ కోసం నన్ను తీసుకొచ్చాడా?" అని అనుకొని షాక్ అవుతుంది. ముకుంద ప్రతి కదలికను అబ్ సర్వ్ చేయడంలో రేవతి నిమగ్నం అయింది.


"ACP సర్... పిలవాల్సిన వాళ్ళు పిలిస్తే వస్తా అంది కదా ముకుంద... మీరు పిలిస్తే ఎలా వచ్చింది. ఆ పిలవాల్సిన వాళ్ళు మీరేనా.. భవాని అత్తయ్య కదా పిలవాల్సింది" అని కృష్ణ అడుగుతుంది. అలా కృష్ణ డౌట్ గా అడిగేసరికి మురారికి ఒక్కసారిగా భయం వేస్తుంది. "లేదు కృష్ణా.. నువ్వు పెద్దమ్మకి మాటిచ్చావ్ కదా.. అందుకే తీసుకొచ్చాను" అని మురారి అంటాడు. కానీ కృష్ణ కి ఇంకా డౌట్ గానే ఉంటుంది. మురారి తన భార్య కోసం నన్ను తీసుకొచ్చాడా అనుకుంటూ... ఎలాగైనా మురారితో మాట్లాడాలని అనుకుంటుంది ముకుంద‌. మురారి గది దగ్గరికి వెళ్లి వద్దులే అని వెనక్కి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.