English | Telugu

Krishna Mukunda Murari : వారిద్దరికి మీరా చెక్ పెట్టనుందా.. భవాని అనుకున్నది నిజమవుతుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -458 లో.. కృష్ణ కడుపు నొప్పితో బాధపడటం.. ఇంటికి వచ్చాక కూడా ఏదో కోల్పోయినట్లు ఉండటం గమనించిన భవానీ.. అదే విషయాన్ని తలుచుకుని భాదపడుతుంది. అయితే భవాని దగ్గరికి రేవతి వచ్చి.. కృష్ణ, మురారీ హాస్పిటల్ కి వెళ్లారని అంటుంది. దాంతో భవానీ.. కృష్ణ నెలతప్పి ఉంటుంది రేవతి.. మనకు సర్ ప్రైజ్ ఇవ్వాలని మనకు ఇంకా చెప్పలేదేమో.. మనమే తనకు సర్ ప్రైజ్ చెయ్యాలంటు కృష్ణ పని చేసే ఆసుపత్రికి కాల్ చేస్తుంది.

కృష్ణ పని చేసే ఆసుపత్రికి భవాని కాల్ చేస్తుంది. మా కోడలు డాక్టర్ కృష్ణ వచ్చిందా ? మురారీ కూడా ఉన్నాడా అని అక్కడి రిసెప్షనిస్ట్ తో భవాని అనగానే.. ఇద్దరు వచ్చారు. ప్రెగ్నెన్సీ కోసం మాట్లాడటానికి వచ్చారని భవానీతో ఆ రిసెప్షనిస్ట్‌ చెప్తుంది. నిజంగానే కృష్ణ నెల తప్పింది కాబోలని భవాని అనుకుంటుంది. రేవతి, మధులకి అందరికి చెప్పేసి.. మురారీ కృష్ణ ఇంటికి వచ్చేలోపు పార్టీ ఏర్పాటు చెయ్యాలి. కొడుకులకు పెళ్లి చేసి ఇన్నేళ్ళైనా పిల్లలు పుట్టలేదని నా ఫ్రెండ్స్ సరస్వతి, సుచిత్రలు ఎన్ని మాటలన్నారు. వాళ్లని వెంటనే రమ్మంటాను పార్టీకి అని వాళ్లకి కాల్ చేసి ఆహ్వానిస్తుంది భవాని. మరోవైపు కృష్ణ, మురారీలు వీదేహీ దగ్గరకి వస్తారు. సరోగసి గురించి చెప్పగానే.. మీరు మరీ అంతగా రిక్వస్ట్ చేస్తున్నారు కాబట్టి.. అద్దెకు ఇవ్వాల్సిన వాళ్లు ఇంత త్వరగా దొరకదు కాబట్టి.. ఆల్రెడీ మీలానే ఒక జంట మమ్మల్ని కలిశారు. వాళ్లకు అద్దెగర్భం ఇచ్చే ఒక అమ్మాయి దొరికింది. తననే మీ బిడ్డను మోసేలా ఒప్పించగలిగితే మీ పని అయిపోతుంది. ఇదంతా రహస్యంగా జరగాలి కాబట్టి నేను మీకోసం ఆ మరో జంటతోనూ.. ఆ అద్దె గర్భం ఇచ్చే అమ్మాయితోనూ మాట్లాడతానంటూ మురారీ, కృష్ణలను వైదేహీ చెప్పగానే.. సరేనని సంతోషిస్తు కృష్ణ, మురారీ ఇంటికి వెళ్తారు. కాసేపటికి వైదేహి దగ్గరకు మీరా వెళ్తుంది.

వైదేహీతో మీరా ఓ ప్లాన్ చెప్తుంది. మరోవైపు ఇంట్లో పార్టీకి ఏర్పాట్లు చేస్తు మధు బిజీగా ఉంటాడు. అదేసమయంలో సుచిత్ర, సరస్వతీలు వస్తారు. సుచిత్ర, సరస్వతి తెగ మూతలు తిప్పేసుకుంటూ.. బిడ్డ పుట్టబోతుందని పార్టీలే ఇంత హడావుడి చేస్తున్నావంటే.. శ్రీమంతం, బారసాలకు ఇంకెంత చేస్తావో భవానీ నువ్వు అంటూ పొగిడేస్తారు. ఇక అప్పుడే మధు వచ్చి.. ఏంటి ఆంటీస్ వచ్చారా అని అంటాడు. మేము వచ్చాంలే కానీ.. మీ ఆవిడ అలేఖ్య పుట్టింటి నుంచి వచ్చిందా అని సుచిత్ర అంటుంది. లేదు ఇంకా రాలేదని మధు అంటాడు. ఇంక రాదులే.. వదిలేసినట్లేనని సుచిత్ర అంటుంది. మీకు అస్సలు తగ్గలేదు ఆంటీలు అని మధు అనగా.. ఏంటదని సుచిత్ర అంటుంది. నోటి దూల అని మధు అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో ఇద్దరు రగిలిపోతారు. ఇక వచ్చినవారికి సంగీత జ్యూసులు ఇస్తుంటే.. తన వెనుకే మధు తిరుగుతుంటాడు. రజినీ మాత్రం రగిలిపోతూ.. ఇద్దరూ కలిసి ఉండద్దని తిట్టి మధుని పంపేస్తుంది. ఈ అత్తను లేకుండా చెయ్యాలని మధు తిట్టుకుంటూ వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.