English | Telugu

కన్నవాళ్ళతో బంధం తెంచుకుంటేనే కోడలిగా ఎంట్రీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -41 లో... రాజ్, కావ్యలని గుమ్మం దగ్గరే ఆపేసి మాట్లాడుతుంది రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణ. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా, నాకు ఇష్టం వున్నా లేకున్నా నేను ఈ ఇంట్లోనే ఉండాలని కావ్య అంటుంది. అలా కావ్య అనడంతో.. నువ్వింకా ఇంట్లోకే అడుగు పెట్టలేదు.. ఇలా మాట్లాడుతున్నావ్ అని అపర్ణ అంటుంది. హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకురాకుండా ఎందుకు అలా మాట్లాడుతున్నావ్? వాళ్ళని ఇంట్లోకి రానివ్వు అని రాజ్ వాళ్ళ తాతయ్య సీతారామయ్య అంటాడు. అప్పుడు అపర్ణ.. నా కడుపు బాధ, మీరైనా మామయ్యకు చెప్పండి అత్తయ్యా అని రాజ్ వాళ్ళ నానమ్మతో అపర్ణ అంటుంది. ఇంట్లో పెద్ద ఆయనే.. ఆయనకు ఎదురు చెప్పను అని రాజ్ నానమ్మ అంటుంది.

ఆ తర్వాత సీతారామయ్య.. రాజ్ వాళ్ళ పిన్ని ధాన్యలక్ష్మిని పిలిచి వాళ్ళిద్దరికి హారతి ఇచ్చి లోపలికి తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడు తను హారతి ఇచ్చి లోపలికి రమ్మంటుంది. కావ్య లోపలికి అడుగుపెట్టబోతుంటే అపర్ణ ఆగమని అంటుంది. ఇంట్లో అందరూ మీ ఇంట్లో వాళ్ళదే తప్పని, నీ తప్పు లేదని నమ్ముతున్నారు.. నువ్వు ఇంట్లోకి రావాలంటే నువ్వు మీ ఇంట్లో వాళ్ళతో ఎలాంటి సంబంధం పెట్టుకోవద్దని చెపుతుంది అపర్ణ. దానికి కావ్య చిన్నప్పటి నుండి ఇంట్లో ప్రేమగా పెంచి పెద్ద చేసిన వాళ్ళతో నేను మాట్లాడతాను అన్నట్లుగా సమాధానమిస్తుంది. అయితే ఇంట్లో నుండి వెళ్ళిపోమని అపర్ణ అంటుంది. మరోవైపు కనకం బాధపడుతూ ఉంటుంది. కావ్య ఆ ఇంట్లో ఎలా ఉందో? వాళ్ళు ఎన్నెన్ని మాటలు అంటున్నారో? అని కావ్యనే తల్చుకుంటూ బాధపడుతుంది కనకం.

మరోవైపు అపర్ణ వెళ్ళిపోమనడంతో కావ్య బయటకు వెళ్తుంటుంది. మధ్యలో రుద్రాణి కల్పించుకొని.. వదిన ఏం చేస్తున్నావ్ అంటూ అడుగుతుంది. ఆ తర్వాత కాసేపటికి కావ్యకి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినవన్నీ గుర్తొస్తాయి. తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుచేసుకొని వెనక్కి వచ్చి.. "ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఈ ఇంటిని వదిలి రావద్దని, మా నాన్న చెప్పాడు అందుకే వెళ్ళట్లేదు" అని అపర్ణతో కావ్య అంటుంది. అయితే నేను చెప్పిన దానికి ఒప్పుకున్నట్లేనా అని అపర్ణ అనగానే.. మీ మనసు ఎన్నటికైనా మారకుండా ఉంటుందా అని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.