English | Telugu

Karthika Deepam2 : దీప మీద కోపంతో అలిగి వెళ్ళిపోయిన శౌర్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -22 లో... శౌర్య షాపింగ్ మాల్ లో సరదాగా తిరుగుతుంటే నర్సింహా రెండో భార్య చూస్తుంది. ఆ రోజు నువ్వే కదా మా పూలు కోసిందని శౌర్యని అడుగుతుంది. దాంతో తనని తిడుతుందని శౌర్య బయపడి.. అక్కడ నుండి వెళ్లి దాక్కుంటుంది. ఆ విషయం నరసింహ భార్య నర్సింహకి చెప్తుంది. ఆ పాప ఇక్కడుందంటే ఆ దీప కూడ ఇక్కడే ఉండి ఉంటుందని.. అది మాత్రం ఈ ఊర్లో ఉండకూడదు.. వెళ్లి ఆ దీపని తిట్టమని నర్సింహని పంపిస్తుంది.

మరొకవైపు శౌర్య కోసం కార్తీక్ వెతికుతుంటాడు. అప్పుడే నర్సింహ, కార్తీక్ ఇద్దరు ఒకరికొకరు ఎదరుపడతారు. అప్పుడే దాక్కొని ఉన్న శౌర్యా అక్కడ నుండి.. రా కార్తీక్ అంటు చాటుగా పిలుస్తుంది. అలా పిలవడం నర్సింహ కూడా చూస్తాడు. వాళ్ళ నాన్నని చూసి కూడా దగ్గరికి రావడం లేదేంటి? అయినా వాళ్ళ నాన్నని చూడలేదని చెప్పింది కదా.. అయిన ఎందుకు భయపడుతుందని శౌర్యని కార్తిక్ తీసుకొని జ్యోత్స్న దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత నీ కూతురు కూడా.. నీ దగ్గరికి రావడం లేదేంటని నర్సింహ భార్య అడుగుతుంది. నన్ను చూడలేదని నర్సింహ అంటాడు. వాళ్ళని వదిలేసినట్టు నన్ను వదిలేస్తావ్.. నేను మా పుట్టింటికి వెళ్లిపోతానని అనగానే.. వాళ్ళని వదిలేసింది నీ కోసమేనని నర్సింహ అంటాడు. అయితే నువ్వేం చేస్తావో నాకు తెలియదు.. ఆ దీప దాని కూతురు ఇక్కడ ఉండడానికి వీలు లేదని నర్సింహకు అతని భార్య చెప్తుంది.

మరొకవైపు జ్యోత్స్న బర్త్ డే కి.. ఏమేమి స్పెషల్ చెయ్యాలో సుమిత్ర, దీప ఇద్దరు డిస్కషన్ చేస్తుంటారు. ఆ తర్వాత దశరథ్ దీప వాళ్ళ నాన్న గురించి అడగంతో.. దీప ఎమోషనల్ అవుతుంది. మరొకవైపు శౌర్య ఐస్ క్రీమ్ తింటుంటే.. తన చెంపలకి అంటిన ఐస్ క్రీమ్ ని కార్తీక్ తుడుస్తాడు. అది నర్సింహ, మరియు అతని భార్య చూస్తారు. మరొకవైపు మల్లేష్ ఇంట్లో‌ అనసూయ పనులు చేస్తుంటుంది. ఆ తర్వాత శౌర్య చేతిలో బట్టలు చూసి.. ఏంటని దీప అడుగగా.. కార్తీక్ కొనిచ్చాడని చెప్తుంది. ఏమైనా అంటే ఏడుస్తుందని దీప సైలెంట్ గా ఉంటుంది. ఇక త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలనుకుంటుంది దీప. తరువాయి భాగంలో కార్తీక్ కి కొనిచ్చిన డ్రెస్ తీసుకొని దీప తన దగ్గరికి వెళ్తుంది. నాకు ఒక హెల్ప్ చేస్తారా అని దీప అడుగగా.. ఏదైనా చేస్తానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.