English | Telugu

Karthika Deepam2 : కార్తీక్ కాలర్ పట్టుకొని నిలదీసిన దీప.. చెంపదెబ్బ కొట్టిన అనసూయ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -266 లో....కాంచన బాధపడుతూ వెళ్ళిపోయిందని సుమిత్ర బాధపడుతుంది. ఇంటి ఆడబిడ్డ నవ్వుతు ఉండాలి కానీ ఇలా శాపాలు పెట్టి వెళ్లిపోయేలా చేసారు. మీరేం అనలేదంటూ సుమిత్ర ఎమోషనల్ అవుతుంది. నాకు బాధగానే ఉందని దశరథ్ అంటాడు. కార్తీక్, కాంచన వాళ్ళు ఇంటికి వస్తారు. దీపకి ఏం తెలియొద్దు అంటూ కార్తీక్ వాళ్ళకి చెప్పి లోపలికి వస్తాడు. లోపలికి వెళ్లేసరకి.. దీప కింద కూర్చొని ఉంటుంది. ఏమైందని కార్తీక్ అడుగగా.. కళ్ళు తిరిగాయని దీప అంటుంది.

మీరు ఎక్కడ నుండి వస్తున్నారని దీప అడుగగా అమ్మ వాళ్ళు తెలిసినా వాళ్ళ ఇంటి నుండి వస్తున్నారు. నాకు ఇక్కడే కలిశారు. అందరం కలిసి లోపలికి వచ్చామంటాడు కార్తీక్. ఇందాక శౌర్య ఉన్న వర్ష వాళ్ళ పేరెంట్స్ వచ్చారని దీప అనగానే దీపకి నిజం తెలిసిందా అని కార్తీక్ అనుకుంటాడు. ఇక శౌర్యా అక్కడ ఉండే అవసరం లేదు కదా మనం వెళ్లి శౌర్యని తీసుకొని వద్దామని దీప అంటుంది. వద్దని కార్తీక్ అంటాడు. అయిన దీప వినదు.. మనం వెళ్ళడానికి శౌర్య ఉంది.. నా ఫ్రెండ్ ఇంట్లో కాదు హాస్పిటల్ లో అంటూ శౌర్య ప్రాబ్లమ్ గురించి చెప్పగానే దీప ఎమోషనల్ అవుతూ.. కార్తీక్ షర్ట్ పట్టుకొని ఇంత జరిగితే నాకు చెప్పకుండా ఉన్నారంటూ ఏడుస్తూ ఉంటుంది. దాంతో అనసూయ దీప చెంపపగులగోడుతుంది. ఎవరిని పట్టుకొని అలా అడుగుతున్నావ్.. ఆ విషయం తెలిసినప్పటి నుండి కార్తీక్ బాబు నరకం అనుభవసున్నాడు. ఇన్ని రోజులు శౌర్యకి చేసినవి అన్ని నీకు చెప్పే చేశాడా అంటూ దీపపై అనసూయ కోప్పడుతుంది.

నన్ను క్షమించండి బాబు అంటూ కార్తీక్ కి దీప చెప్తుంది. శౌర్య మన కూతురు.. తన కోసం మా అమ్మ తన పుట్టింటికి కూడా వెళ్ళింది.. నేను ఎలాగైనా నా కూతురిని కాపాడుకుంటానని కార్తీక్ అంటాడు. దీప తన దగ్గరున్న డబ్బు ఇస్తుంది. ఇది కాదు యాభై లక్షలు అవుతుందని చెప్పగానే దీప షాక్ అవుతుంది. నేను ముందు నా కూతురు ని చూడాలంటూ దీప హాస్పిటల్ కి వెళ్తుంది. తన వెనకాలే కార్తీక్ వెళ్తాడు. మరోవైపు ఊళ్ళో ఉన్న ఇల్లు అమ్మేస్తానంటు కాంచనకి చెప్పి అనసూయ వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.