English | Telugu

Eto Vellipoyindhi Manasu : భర్తకి మరణగండం ఉందని తెలుసుకున్న భార్య.. జాగ్రత్తగా ఉండమన్న స్వామి!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -313 లో..... శ్రీలత, శ్రీవల్లిలు ధన, సందీప్ లని బయటకు తీసుకొని రావడానికి స్టేషన్ కి లాయర్ ని తీసుకొని వెళ్తారు. అక్కడ సీఐ సీతాకాంత్ ఫ్రెండ్ తనని చూసి నువ్వు సీతా ఫ్రెండ్ కదా.. వాళ్ళని వదిలేయ్ అని శ్రీలత అనగానే.. పరిచయాలు ఇక్కడ పని చెయ్యవు అని సీఐ అంటాడు. బెయిల్ తీసుకొని వచ్చామని శ్రీలత అనగానే.. బెయిల్ రాదు జనాలని ఫ్రాడ్ చేసిన కేసు ఇది అని అతను చెప్తాడు. అదంతా చూస్తూ భద్రం నవ్వుకుంటాడు. మా వాళ్ళకేం తెలియదు కావాలనే వాళ్ళని ఆ భద్రం కేసులో ఇరికించాడని శ్రీలత అంటుంది.

వాళ్ళు కూడా తప్పు చేశారంటూ అన్నిటిలో భద్రంతో వాళ్ళ సంతకాలు ఉన్నాయంటూ సీఐ చూపిస్తాడు. ఇప్పుడు మేము రిచ్ దేనికైనా ఒక రేట్ ఉంటుంది. మీకు ఎంత కావాలని శ్రీవల్లి అనగానే.. నాకే లంచం ఇస్తావా ఆవిడని అరెస్ట్ చెయ్యండి అని సీఐ అనగానే.. వద్దు అని శ్రీవల్లి, శ్రీలత రిక్వెస్ట్ చేస్తారు. ఇంకోసారి అలా మాట్లాడితే బాగుండదంటూ సీఐ వార్నింగ్ ఇస్తాడు. శ్రీలత వెళ్తు సందీప్, ధనలని పలకరిస్తుంది. మిమ్మల్ని ఎలాగైనా బయటకు తీసుకొని వస్తామని శ్రీలత వాళ్లతో చెప్తుంది. రామలక్ష్మి రాత్రి వచ్చిన కల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నాకేం కాదు నువ్వు భయపడకు అంటూ సీతాకాంత్ చెప్తాడు.

శ్రీలత, శ్రీవల్లి ఇంటికి వస్తారు. వాళ్ళు ఎక్కడ అని సిరి అడుగుతుంది. బెయిల్ రాదట అని శ్రీలత బాధపడుతుంది. సీతా అన్నయ్య వాళ్ళని బయటకు తీసుకొని వస్తాడని సిరి అనగానే.. ఇప్పుడు వాడు మన మాట వినేలా లేడు భార్య మాట వింటాడని శ్రీలత అంటుంది. నేను చెప్తే కచ్చితంగా అన్నయ్య వింటాడని సిరి సీతాకాంత్ దగ్గరికి వెళ్తుంది. ధన సందీప్ లు బయటకు రావాలంటే ఏం చెయ్యాలో నాకు తెలుసంటూ నవ్వుతుంది శ్రీలత. రామలక్ష్మి టెన్షన్ గా స్వామి దగ్గరికి వస్తుంది. తనకి మరణగండం ఉందని స్వామి చెప్పగానే రామలక్ష్మి భయపడుతుంది. దీనికి సొల్యూషన్ చెప్పండి అని రామలక్ష్మి అనగానే.. నేను త్వరలోనే చెప్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి అని స్వామి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.