English | Telugu
Karthika Deepam2 : వంటలక్కకి దిమ్మతిరిగే షాక్.. ఆ నిజం తెలుసుకున్న కార్తిక్!
Updated : Jul 24, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -104 లో.. కార్తీక్ తో మాట్లాడింది దీప గుర్తుకుచేసుకుంటుంది. ఈ కార్తీక్ బాబు.. ఏ నిర్ణయం తీసుకుంటాడో నాకు భయంగా ఉందని దీప అనుకుంటుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని దీపతో కార్తీక్ అంటాడు. ఇంట్లో శౌర్య ఉందా అని కార్తీక్ అడుగుతుంది. లేదు సుమిత్ర గారి దగ్గరికి వెళ్ళిందని దీప చెప్తుంది. మంచి పని చేసిందని కార్తీక్ అంటాడు. ఏదో ఇంపార్టెంట్ విషయం అన్నారు.. ఏంటని దీప అడుగుతుంది. స్వప్న బాధ్యతలు నాకు అప్పజెప్పావు కదా ఇప్పుడు స్వప్న ని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను.. ఏం అంటావని కార్తీక్ అనగానే.. దీప షాక్ అవుతుంది.
అవును దీప మీ నిర్ణయం చెప్పండి వాళ్ళ ఫ్యామిలీ మనతో కూడా మాట్లాడాను.. ఇదిగో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అంటూ కార్తీక్... శ్రీధర్, కావేరి , స్వప్న ఉన్న ఫోటోని చూపించిగానే దీప షాక్ అవుతుంది. నాకెలా తెలుసు అనుకుంటున్నావ్.. నా కంటే ముందు నీకు తెలుసు.. అందుకే స్వప్న బాధ్యతలు నాకు అప్పజెప్పావు.. రెస్టారెంట్ లో నాన్నని టేబుల్ దగ్గరికి రాకుండా చేసావని కార్తీక్ అంటాడు. అన్ని విషయాలు చెప్పాను.. నువ్వు మాత్రం ఇంత పెద్ద నిజం ఎందుకు చెప్పలేదని దీపతో కార్తీక్ అంటాడు. మీ అమ్మ కోసం.. తనకి నిజం తెలిస్తే తట్టుకోలేరని దీప అంటుంది. ఏ నిర్ణయం తీసుకుంటారో ఇక మీ ఇష్టమని కార్తీక్ తో దీప అంటుంది. కార్తీక్ వెళ్ళిపోయాక జ్యోత్స్న చూసి.. ఎల్లుండి ఎంగేజ్మెంట్ నాతో పెట్టుకొని.. దానితో ఏం మాట్లాడి వెళ్లిపోతున్నాడని అనుకుంటుంది.
మరొకవైపు కార్తీక్ ఇంటికి వెళ్తాడు. అక్కడ శ్రీధర్ కాంచనతో సరదాగా మాట్లాడుతుంటే.. కార్తీక్ కి కోపం వస్తుంది. ఇండైరెక్ట్ గా శ్రీధర్ ని అన్నీ అంటుంటే.. వీడేంటి ఈ రోజు ఇలా మాట్లాడుతున్నాడు.. కావేరి గురించి దీప చెప్పిందా అని శ్రీధర్ అనుకుంటాడు. ఆ తర్వాత దీప దగ్గరికి జ్యోత్స్న వచ్చి మాట్లాడాలని అంటుంది. నువ్వు ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయావ్.. మళ్ళీ ఎందుకు వచ్చావంటూ అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.