English | Telugu

Karthika Deepam 2: దీపకి భోజనం పెట్టిన సుమిత్ర.. కార్తీక్ హ్యాపీ.. జ్యోత్స్నకు బీపీ!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -476 లో... దీప కళ్ళు తిరిగి పడిపోవడంతో సుమిత్ర వచ్చి లేపుతుంది. ప్రొద్దున నుండి భోజనం చెయ్యలేదట అని భోజనం తీసుకొని వస్తుంది. నాకు మానవత్వం ఉంది కాబట్టే భోజనం తీసుకొని వచ్చాను కానీ, నీకు తినిపించేంత ప్రేమ లేదు నువ్వే తినమని సుమిత్ర అంటుంది.

దీప భోజనం తినడం స్టార్ట్ చేస్తుంది. ఇక సుమిత్ర తన మాటలతో బాధపెడుతుంది. పెరుగు అన్నం వేసుకోమని తీసుకొని వస్తుంది. అందులో ఉప్పు వెయ్యలేదు. ఉప్పు తిన్న విశ్వాసం ఇప్పటివరకు చూపించింది చాలని సుమిత్ర అంటుంది. సుమిత్ర మాటలకి దీప ఏడుస్తుంది. అప్పుడే కార్తీక్ వాళ్ళు వస్తారు. దీపకి సుమిత్ర ప్రేమతో భోజనం పెట్టిందనుకుంటారు. వాళ్ళు రాగానే నాకు మానవత్వం ఉంది కాబట్టి భోజనం పెట్టానని సుమిత్ర చెప్పి వెళ్ళిపోతుంది. మీ అమ్మ ప్రేమతో భోజనం పెట్టిందని దీపతో కార్తీక్ అంటాడు. మరొకవైపు ఈ రోజు భోజనం పెట్టింది.. రేపు కలిసిపోతారని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. పారిజాతం కోపంగా మాట్లాడుతుంటే.. గ్రానీ నేను చేసింది తప్పు.. నీ మాటలతో చంపకు అని జ్యోత్స్న అంటుంది. ఇప్పటికైనా నేనంటే ఏంటో తెలిసిందని పారిజాతం అంటుంది.

మరొకవైపు కాంచన దగ్గరికి శ్రీధర్ సరుకులు తీసుకొని వస్తాడు. వద్దని కాంచన అంటుంది. కొంత డబ్బు కాంచనకు శ్రీధర్ ఇచ్చి అవసరం ఉన్నప్పుడు వాడుకోండి దయచేసి వద్దనకు.. కార్తీక్ కి చెప్పకని శ్రీధర్ రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడే కార్తీక్ వాళ్ళు వస్తారు. కాంచన డబ్బు దాస్తుంది. థాంక్స్ కాంచన అని శ్రీధర్ అంటాడు. ఈ సరుకులు ఎవరు తీసుకొని వచ్చారని కార్తీక్ అడుగగా.. మీ నాన్న అని అనసూయ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.