English | Telugu

Jayam serial : గంగని చంపించడానికి వీరు ప్లాన్.. సైదులు ఏం చేయనున్నాడు!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -45 లో......గంగ వినాయకుడి పూజ చేస్తుంది. మరొకవైపు సూపర్ మార్కెట్ లో వినాయకచవితి ఆఫర్స్ అని రుద్ర ఆఫర్స్ పెడతాడు. ఎక్కువ కొన్నవారికి దీపం ఆయిల్ ఫ్రీ అని చెప్తాడు. ఆ తర్వాత సూపర్ మార్కెట్ లో ఒకవిడ దొంగతనం చేస్తూ మక్కంకి కన్పిస్తుంది. అతను వెంటనే రుద్రకి చెప్తాడు. అలా ఆడవాళ్ళని నువ్వు దొంగతనం చేసావని వేలెత్తి చూపించొద్దు. నేను చెప్పినట్టు చెయ్ అని రుద్ర మక్కం కి ఏదో ప్లాన్ చెప్తాడు.

మక్కం కస్టమర్ లాగా సరుకులు తీసుకుంటాడు. బిల్ దగ్గరికి వస్తాడు. నువ్వు ఇప్పుడు దొంగతనం చేసావ్ కదా అని మక్కం తో రుద్ర అంటాడు. ఇలా ఎవరైనా చేస్తారా అంటూ రుద్ర ఇండైరెక్ట్ గా దొంగతనం చేసినవిడని అంటుంటే ఆవిడ తప్పు చేసానని మళ్ళీ లోపలికి వెళ్లి దొంగతనం చేసిన సరుకులు మళ్ళీ అక్కడే పెట్టేస్తుంది. ఆ తర్వాత మక్కం చెయ్ జారీ రాత్రి వీరు మనిషి చేంజ్ చేసిన కల్తీ ఆయిల్ ప్యాకెట్ కిందపడుతుంది. అది పెట్రోల్ వాసన రావడంతో రుద్రని పిలిచి చెప్తాడు మక్కం. ఇది ఎవరో కావాలనే చేసారు. సీసీటీవీ ఫుటేజ్ ఆన్ చెయ్యండి అని రుద్ర అంటాడు. అప్పుడే సీసీటీవీ ఫుటేజ్ ఎర్రర్ వస్తుంది. అప్పుడే అక్కడికి పెద్దసారు గంగ వస్తారు.

మక్కం నువ్వు వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని రుద్ర చెప్తాడు. ఆ తర్వాత ఆఫర్ గా విగ్రహం ఇవ్వాలని అనుకున్నాం కదా ఆ లోడ్ రావడానికి ఇంకా టైమ్ పడుతుందని మక్కం చెప్తాడు. దానికి ఎందుకు టెన్షన్ అని గంగ మట్టితో వినాయకుడని రెడి చేస్తుంది. తరువాయి భాగంలో వినాయకుడి నిమర్జనంలో గంగ వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే తనని చంపడానికి సైదులుని వీరు పంపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.