English | Telugu

Jayam serial : గంగకి శకుంతల సపోర్ట్.. రుద్ర ఏం చేయనున్నాడు!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -32 లో.... గంగని మను వెతుక్కుంటూ గుడికి వస్తాడు. గంగని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. అమ్మవారి మెడలోని తాళి తీసుకొని మను గంగ మెడలో కట్టబోతుంటే రుద్ర వచ్చి మనుని ఆపుతాడు. మనుని కొడతాడు రుద్ర. ఆ తర్వాత రౌడీలని కూడా కొడతాడు రుద్ర. అదంతా దూరం నుండి వీరు చూసి మళ్ళీ ఈ రుద్ర ఎక్కడ నుండి వచ్చాడని డిస్సపాయింట్ అవుతాడు.

రౌడీలని పోలీసులకి పట్టించండి ఒక వీడిని మాత్రం నాకు అప్పగించండి అని మనుని తీసుకొని రుద్ర పెళ్లి మండపం దగ్గరికి వెళ్తాడు. గంగ కూడా వెళ్తుంది. రుద్ర సర్ లేకుంటే నా పరిస్థితి ఏమై ఉండేదోనని గంగ ఎమోషనల్ అవుతుంది. మనుని రుద్ర, పెద్దసారు కొడతారు. నువ్వు ఇదంతా ఎందుకు చేసావని అడుగుతారు. వీడు నిజం చెప్తాడా ఏంటని ఇషిక టెన్షన్ పడుతుంది. అప్పుడే వీరు పోలీసులని తీసుకొని వచ్చి మనుని అరెస్ట్ చేయమని చెప్తాడు. నువ్వు ఇప్పుడు సైలెంట్ గా వెళ్ళు నిన్ను తర్వాత బయటకు తీసుకొని వస్తానని మనుకి వీరు సైలెంట్ గా చెప్తాడు. ఆ తర్వాత గంగ మీ అమ్మ కనిపించడం లేదు అని గంగ ఫ్రెండ్స్ తన దగ్గరికి వచ్చి చెప్తారు.

ఈ లెటర్ దొరికింది అని ఇస్తారు. ఆ లెటర్ పెద్దసారు చదువుతాడు. గంగ నువ్వు నా కోసం చాలా కష్టపడ్డావ్.. నాతో ఉంటే మళ్ళీ మీ నాన్న ఎవరికైనా అమ్మేస్తాడు.. అందుకే నేనే నీకు దూరంగా వెళ్తున్నా నా కోసం చూడకు.. నిన్ను అమ్మగారు చేరదీస్తారు. అనుకుంటున్నా.. జాగ్రత్త అని అందులో రాసి ఉంటుంది. అది విని గంగ బాధపడుతుంది. తరువాయి భాగంలో గంగని పెద్దసారు ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఎందుకు తీసుకొని వచ్చారని ఇంట్లో వాళ్ళు అడ్డుచెప్తారు. గంగ ఇక్కడే ఉంటుంది మీకు ఇష్టం లేకపోతే ఎవరికి వారు విడిగా ఉందామని శకుంతల అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.